పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా వైరస్ అనుమానిత కేసులు
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి.. తెలుగు రాష్ట్రాల్లోనూ పంజా విసురుతోంది. ఇప్పటికే తెలంగాణలో కరోనా కేసు నమోదైంది. దుబాయ్ నుంచి బెంగళూరు మీదు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి.. తెలుగు రాష్ట్రాల్లోనూ పంజా విసురుతోంది. ఇప్పటికే తెలంగాణలో కరోనా కేసు నమోదైంది. దుబాయ్ నుంచి బెంగళూరు మీదు
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి.. తెలుగు రాష్ట్రాల్లోనూ పంజా విసురుతోంది. ఇప్పటికే తెలంగాణలో కరోనా కేసు నమోదైంది. దుబాయ్ నుంచి బెంగళూరు మీదు హైదరాబాద్ వచ్చిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కరోనా బారిన పడ్డాడు. గాంధీ ఆసుపత్రిలో అతడికి చికిత్స అందిస్తున్నారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో దక్షిణ కొరియా నుంచి వ్యక్తిలో కరోనా లక్షణాలు కనిపించడం కలకలం రేపుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
అటు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ కరోనా వైరస్ అనుమానిత కేసులు వెలుగు చూశాయి. విదేశాల నుంచి వచ్చిన 48మంది వైద్యాధికారులు గుర్తించారు. 19మందికి పరీక్షలు చేశారు. మిగతా వారిని 28 రోజుల పాటు అబ్జర్వేషన్ లో ఉంచారు. వీరిలో ఎవరిలోనూ కరోనా లక్షణాలు లేవని డాక్టర్లు నిర్ధారించారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ముందు జాగ్రత్తగా కొందరిని పరిశీలనలో ఉంచారు. మరోవైపు ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డి గూడెం ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. కరోనా అనుమానితులకు ఆ వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ప్రతాపం చూపిస్తోంది. ఇప్పటివరకు 80కుపైగా దేశాల్లో కరోనా వ్యాపించింది. 90వేల మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. 3వేల 500 మంది మృత్యువాత పడ్డారు. వైరస్ వెలుగులోకి వచ్చి రెండు నెలలు అవుతున్నా.. ఇప్పటివరకు ఈ వైరస్ కు వ్యాక్సిన్ లేదు. దీంతో అంతా హడలిపోతున్నారు.
మన దేశంలోనూ కరోనా విజృంభణతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. భారత్‌లో కరోనా విస్తరించడకుండా చర్యలు చేపట్టింది. పలు దేశాల నుంచి భారత్‌లోకి ప్రవేశించేవారిపై కఠిన అంక్షలు విధిస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాకపోకలపై నిషేధం విధించింది. విదేశీయులకు మన దేశంలోకి ఎంట్రీపై బ్యాన్ విధించింది. తక్షణమే ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. అంతేకాకుండా విదేశీ ప్రయాణాలపై కీలక సూచనలు చేసింది.