విదేశాల నుంచి ఏపీకి వచ్చిన పలువురికి కరోనా

విదేశాల నుంచి ఏపీకి వచ్చిన వారిలో పలువురికి కరోనా పాజిటివ్ వచ్చింది. దుబాయ్ నుంచి వచ్చిన 144 మందిలో 56 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు నూజివీడు ట్రిపుల్ ఐటీ క్వారంటైన్ సెంటర్ ఇంచార్జ్, స్థానిక ఎమ్మార్వో సురేష్ తెలిపారు. వీరిని నూజివీడు ట్రిపుల్ ఐటీ క్వారంటైన్ సెంటర్ కు విజయవాడకు ప్రత్యేక వాహనాల్లో తరలిస్తున్నారు. ఈనెల 21న నూజివీడు ట్రిపుల్ ఐటీకి వీరిని తరలించారు.
వందే భారత్ కార్యక్రమంలో భాగంగా ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారిని ప్రత్యేక విమానాల్లో ఏపీకి తీసుకరావడం జరుగుతుంది. కువైట్ లో ఉన్న 144 మందిని ఈనెల 21న గన్నవరం ఎయిర్ పోర్టుకు తీసుకొచ్చి, జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం నూజివీడు ట్రిపుల్ ఐటీ క్వారంటైన్ లో ఉంచారు.
జిల్లా యంత్రాంగం సూచనల ప్రకారం ఈనెల 22వ తేదీన వాందరరి నుంచి స్వాప్ కలెక్షన్ చేసి, వారందరికి కూడా టెస్టులు చేయగా వారిలో 56 మందికి అనుమానాస్పద లక్షణాలు ఉన్నాయి. ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ముందస్తు జాగ్రత్త చర్యగా పిన్నమనేని సిధార్థ మెడికల్ హాస్పిటల్ కు పంపిచాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
కలెక్టర్ ఆదేశాల ప్రకారం వారిని వీరిని ప్రత్యేక వాహనాల్లో పిన్నమేని హాస్పిటల్ చౌటపల్లికి తరలించారు. మిగిలిన 88 మంది కూడా ఎవరికైతే నెగెటివ్ వచ్చిన వారిని ఇక్కడే ఉంచారు. వారందరికీ కూడా జిల్లా యంత్రాంగం బ్రేక్ ఫాప్ట్, లంచ్, సాయంత్ర స్నాక్స్ తోపాటు రాత్రి భోజనాలు ఏర్పాటు చేశారు. అదే విధంగా వారు 24 గంటలు పేషెంట్స్ ప్రభుత్వ వైద్యుల పరిక్షణలో ఉంటారు.
Read: ఏపీలో కరోనా అప్‌డేట్: 2,671కి చేరిన కరోనా కేసులు