ఏపీలో కరోనా ఫీవర్ : 39 కొత్త కేసులు

ఏపీలో ఇంకా కరోనా వీడడం లేదు. విస్తృతంగా విస్తరిస్తోంది. దీంతో కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రధానంగా కర్నూలు, గుంటూరు జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. 2020, ఏప్రిల్ 20వ తేదీ సోమవారం ఉదయం నుంచి ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 39 కేసులు రికార్డయ్యాయి. ఇందులో గుంటూరులో 13, కర్నూలు 10 కేసులుండడం వైరస్ ఎంత వేగంగా వ్యాపిస్తుందో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 761 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
సోమవారం 20, మంగళవారం 13 కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారయంత్రాంగం పూర్తిగా అలర్ట్ అయ్యింది. వ్యాధి మరింత విస్తరించకుండా ఉండేందుకు మరిన్ని చర్యలు చేపడుతున్నారు. నరసరావుపేటలో 20 కేసులు నమోదు కావడంతో వ్యాధి నివారణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. మొత్తం 1400 పైగా వ్యాధి నిర్ధారణ పరీక్షల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో ఎన్ని కేసులు నమోదవుతాయనే టెన్షన్ నెలకొంది.
జిల్లాల వారీగా : –
కర్నూలు 18. గుంటూరు 16, కృష్ణా 83. నెల్లూరు 67. చిత్తూరు 53. కడప 46. ప్రకాశం 44. పశ్చిమ గోదావరి 39. అనంతపురం 36. తూర్పుగోదావరి 26. విశాఖపట్టణం 21