Covid Patient Dies : కోవిడ్ తో భార్య ఒడిలోనే కన్నుమూసిన భర్త
కుప్పం రైల్వే స్టేషన్ లో ఓ కోవిడ్ పేషంట్.. భార్య ఒడిలోనే కన్నుమూశాడు

Covid Patient Dies At Kuppam Railway Station
Kuppam Railway Station : కుప్పం రైల్వే స్టేషన్ లో ఓ కోవిడ్ పేషంట్.. భార్య ఒడిలోనే కన్నుమూశాడు. చిత్తూరు జిల్లా కుడిపల్లే మండలం పెద్దూరు గ్రామానికి చెందిన చంద్రశేఖర్ కు కరోనా సోకింది. మెరుగైన వైద్యం కోసం భార్యతో కలిసి బెంగుళూరు వెళ్ళేందుకు కుప్పం రైల్వేస్టేషన్ కి వచ్చాడు.
ట్రైన్ కోసం ఎదురు చూస్తుండగా చంద్రశేఖర్ పరిస్థితి విషమించింది. స్టేషన్ ప్లాట్ ఫాంపై ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యాడు. వారిని ఆదుకునేందుకు అక్కడ ఎవ్వరూ ప్రయత్నించలేదు. చాలా సేపటి వరకు ఎలాంటి వైద్య సహాయం అందలేదు.
చివరకు భార్య ఒడిలోనే తుది శ్వాస విడిచాడు. ఒడిలోనే ప్రాణాలు విడిచిన భర్తను చూసి ఆ మహిళ స్టేషన్ లో గుండెలవిసేలా ఏడ్చింది. భర్త మృతదేహం పక్కన భార్య విలపించిన తీరు అందరిని కలచి వేసింది.