జగన్ ప్రభుత్వంలో ఎన్నో అవమానాలు పడ్డా..! మంత్రి లోకేశ్‌ను కలిసిన క్రికెటర్ హనుమ విహారీ

ఏపీకి చెందిన వ్యక్తిని అయినప్పటికీ గత పాలకులు నన్ను ఇబ్బందులకు గురి చేశారు.

జగన్ ప్రభుత్వంలో ఎన్నో అవమానాలు పడ్డా..! మంత్రి లోకేశ్‌ను కలిసిన క్రికెటర్ హనుమ విహారీ

Cricketer Hanuma Vihari (Photo Credit : Facebook)

Hanuma Vihari : తెలుగు క్రికెటర్ హనుమ విహారి మంత్రి నారా లోకేశ్ ను కలిశారు. జగన్ ప్రభుత్వంలో తనకు జరిగిన అవమానాలను మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు హనుమ విహారి. గత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు హనుమ విహారి.

”నా టాలెంట్ ను గత ప్రభుత్వం తొక్కేసింది. నేను ఉంటే వారికి ఇబ్బందులని ఏసీఏ భావించింది. చిన్న విషయాన్ని పెద్దదిగా చూపి నాతో రాజీనామా చేయించారు.  16 ఇంటర్నేషనల్ మ్యాచులు ఆడాను. ఒక్క మ్యాచ్ ఆడగానే రిజైన్ చేయాల్సిందే అని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ నాపై ఒత్తిడి తీసుకొచ్చారు. వారు చెప్పిన వారిని టీంలో పెట్టుకోకపోతే మేము సహించం అంటూ బలవంతంగా నాతో రాజీనామా చేయించారు.

నన్ను బలవంతంగా రిజైన్ చేయించినప్పుడు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ నాకు అండగా నిలబడ్డారు. ఏపీకి చెందిన వ్యక్తిని అయినప్పటికీ గత పాలకులు నన్ను ఇబ్బందులకు గురి చేశారు. అప్పటి ఏసీఏ వ్యవహరించిన తీరుతోనే నేను వేరే రాష్ట్రం తరుపు ఆడాలని భావించా. అయితే మంత్రి లోకేశ్ ఇచ్చిన హామీతో తిరిగి ఏసీఏ తరుపున ఆడాలని నిర్ణయించుకున్నా. ఆంధ్రాలో క్రికెట్ ను ఎంకరేజ్ చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు” అని క్రికెటర్ హనుమ విహారీ తెలిపారు.

 

క్రికెటర్ హనుమ విహారీ తనను కలిసిన క్రమంలో.. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) తో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని విహారీకి మంత్రి లోకేశ్ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో తిరిగి ఆంధ్రా క్రికెట్ టీమ్ తరుపున ఆడాలని విహారీ నిర్ణయించుకున్నారు.

 

Also Read : బొత్స కుటుంబం ఇక ఇంటికే పరిమితమా? ఘోర ఓటమికి ప్రధాన కారణం అదేనా?