ఏపీ, తెలంగాణ మధ్య డేటా వార్ : హైకోర్టుకు ఐటీ గ్రిడ్ వివాదం

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల మధ్య డేటా వార్ మరింత ముదురుతోంది. తాజాగా ఐటీ గ్రిడ్ వివాదం తెలంగాణ హైకోర్టుకు చేరింది. నలుగురు ఉద్యోగులు కనిపించడం లేదంటూ ఆ సంస్థ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. రేగొండ భాస్కర్, ఫణి కడలూరి, చంద్రశేఖర్, విక్రమ్‌గౌడ్ కనిపించడం లేదంటూ ఐటీ గ్రిడ్ ఉద్యోగి అశోక్ ఈ పిటిషన్ వేశారు.
హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్పసొసైటీలోలోని ఐటీ గ్రిడ్ సంస్థ చుట్టూ ముసురుతున్నాయి. టీడీపీకి ఐటీ సేవలు అందిస్తున్న ఈ సంస్థ నుంచి సైబరాబాద్ పోలీసులు సోదాలు నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. ఈ సంస్థ రూపొందించిన సేవా మిత్ర యాప్‌లో ఏపీకి చెందిన మూడు కోట్ల మంది ఓటర్ల జాబితా ఉందంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డి ఫిర్యాదుపై స్పందించిన మాదాపూర్ పోలీసులు.. ఐటీ గ్రిడ్‌కు చెందిన ఇద్దరు ప్రతినిధులను అదుపులోకి తీసుకోవడంతోపాటు హార్డ్ డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఐటీ గ్రిడ్ రూపొందించిన సేవా మిత్ర యాప్‌లో ఏమున్నదన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిలో ఏపీ ఓటర్ల వివరాలు, వారి ఆధార్ కార్డులతోపాటు ప్రభుత్వ పథకాల లబ్ధి దారులు వివరాలు ఉన్నాయన్నది వైసీపీ ఆరోపణ. ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకునే ప్రతి టీడీపీ కార్యకర్తలను సమాచారం సమాచారం అంతా అందుబాటులోకి వస్తుందని వైపీసీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ అధికార ఫేస్‌బుక్ పేజీలో సేవామిత్ర వివరాలు అందుబాటులో ఉన్నాయని వైసీపీ నేతల ఫిర్యాదు చేయడం రాజయకీయంగా కలకలం రేపుతోంది. ఈ డాటా అంతా ఇతర సంస్థలకు చేరిందని వైపీసీ ఫిర్యాదు చేయడంతో రాజకీయ రగడ ప్రారంభమైంది.