Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. కారణం ఏమిటంటే?

ప్రతీయేటా వేసవి సెలవుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంకు వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో తిరుమల కొండపై రద్దీ నెలకొంటుంది. అయితే, ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉ్నట్లు తెలుస్తోంది.

Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. కారణం ఏమిటంటే?

Tirumala Tirupati Devasthanam

Updated On : May 3, 2025 / 10:20 AM IST

Tirumala: కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు వచ్చిన సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల వెళ్తుంటారు. దీంతో ప్రతీ వేసవికాలం సెలవుల్లో రెండు నెలలు తిరుమలలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అయితే, ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: Quantum Valley: ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం.. అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు డీల్

తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. వేసవి సెలవులు ఉన్నప్పటికీ రద్దీ పెరగలేదని తెలుస్తోంది. వీకెండ్ అయినప్పటికీ శ్రీవారి సర్వదర్శనానికి 20 కంపార్ట్ మెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేకుండా ఐదు గంటల్లోనే శ్రీవారి సర్వదర్శనం పూర్తవుతుంది. నిన్న శ్రీవారిని 74,344 మంది భక్తులు దర్శించుకోగా.. శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.50కోట్లు సమకూరించింది. అయితే, తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడానికి ప్రధాన కారణం టీటీడీ పాలకవర్గం తీసుకున్న కీలక నిర్ణయమేనని తెలుస్తోంది.

Also Read: ఆ బాధను ప్రధాని మోదీలో చూశాను: చంద్రబాబు నాయుడు

వేసవి సెలవుల దృష్ట్యా రద్దీ ఎక్కువగా ఉంటుందని భావించి.. సామాన్యులకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ‘‘వేసవికాలం రెండు నెలలు వీఐపీ, సిఫార్సు లేఖలపై దర్శనాలు రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. సెలవుల నేపథ్యంలో కుటుంబాలతో తిరుపతికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, భక్తులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో మే 1 నుంచి జూన్ 30వ తేదీ వరకు సిఫార్సు లేఖలపై సేవలు దర్శనాలు టీటీడీ పాలకవర్గం రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సిఫార్సు లేఖలు రద్దుచేయడంతో తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడానికి కారణంగా తెలుస్తోంది.