దేవినేని అవినాష్‌తో పాటు రాజీనామా చేసిన టీడీపీ సీనియర్ నేత

  • Published By: vamsi ,Published On : November 14, 2019 / 09:33 AM IST
దేవినేని అవినాష్‌తో పాటు రాజీనామా చేసిన టీడీపీ సీనియర్ నేత

Updated On : November 14, 2019 / 9:33 AM IST

దేవినేని నెహ్రు వారసుడిగా రాజకీయ అరగేంట్రం చేసిన దేవినేని అవినాష్ తెలుగుదేశం పార్టీ గుడ్ బై చెప్పేశారు. పార్టీకి, తెలుగు యువత అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అవినాష్, తన రాజీనామా లేఖను తెలుగుదేశం రాష్ట్ర కార్యాలయానికి పంపారు.

అవినాష్‌తో పాటూ సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు కూడా పార్టీకి రాజీనామా చేశారు. సాయంత్రం 4గంటలకు దేవినేని అవినాష్ వైసీపీ అధినేత జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

కొద్ది రోజులుగా దేవినేని అవినాష్ పార్టీ మారుతున్నట్లు వార్తలు వచ్చినా కూడా ఎప్పటికప్పుడు వాటిని ఆయన ఖండిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే పార్టీలో సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదనే మనస్తాపంతో పార్టీకి, పార్టీ పదవులకు రాజీనామా చేశారు. అనుచరుల అభిప్రాయాలను తీసుకుని, టీడీపీలో సరైన ప్రాధాన్యం దక్కకపోవడంతో పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్లుగా అవినాష్‌ చెబుతున్నారు.

ఒకవైపు చంద్రబాబు నాయుడు విజయవాడలో ధర్నా చౌక్ వేదికగా జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా దీక్ష చేస్తుంటే దేవినేని అవినాష్ పార్టీ మారడం ఆ పార్టీకి షాక్ అనే చెప్పుకోవాలి. అవినాష్ అంతకుముందు కాంగ్రెస్ తరపున విజయవాడ ఎంపీగా పోటీ చేశారు. 2014లో కోడాలి నానీ మీద పోటీ చేసి గుడివాడలో ఓడిపోయారు.