ఏపీలో ఎలక్ట్రిక్ బస్సులు వచ్చేస్తున్నాయ్.. త్వరలో ఆ జిల్లాల్లో నడిపేందుకు సిద్ధమవుతున్న ఏపీఎస్ఆర్టీసీ

ఏపీలో త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. తొలి దశలో 750 పీవీటీ ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన ఏపీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానుంది.

ఏపీలో ఎలక్ట్రిక్ బస్సులు వచ్చేస్తున్నాయ్.. త్వరలో ఆ జిల్లాల్లో నడిపేందుకు సిద్ధమవుతున్న ఏపీఎస్ఆర్టీసీ

ELECTRIC BUSES

Updated On : August 6, 2025 / 12:09 PM IST

AP Govt: ఏపీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన విద్యుత్ వాహనాల విధానం 2024-2029కి అనుగుణంగా వచ్చే ఐదేళ్లలో సంస్థలో అన్నీ ఎలక్ట్రిక్ బస్సులే నడపాలని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో త్వరలో తొలి దశలో ఏపీలోని పలు జిల్లాల్లో ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు.

Also Raed: ఏపీలో మహిళలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెలకు రూ.15వేల నుంచి రూ.30వేల వరకు ఆదాయం..

ఏపీలో త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. తొలి దశలో 750 పీవీటీ ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన ఏపీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానుంది.

అమరావతి, అనంతపురం, కడప, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, కర్నూలు, విశాఖపట్నం, తిరుపతి ఆర్టీసీ డిపోల నుంచి తొలి దశలో వీటిని నడపనున్నారు.

వీటికోసం కేంద్రం అందించే రూ. 190 కోట్లతో ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి తేనున్నారు. ఒక్కో స్టేషన్ కోసం రూ.4కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు చెప్పారు.

ఈ ఎలక్ట్రిక్ బస్సులు డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ తొలి విడతలో ఈ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.