PRC Report : ఆందోళన విరమించిన ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు
ఏపీ ప్రభుత్వ తీరుపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. పీఆర్సీ నివేదిక కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు సచివాలయంలో ఆందోళన విరమించారు.

Employees Asscociations Leaders Demand For Prc Reccomendations
Employees Asscociations Leaders : ఏపీ ప్రభుత్వ తీరుపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. పీఆర్సీ నివేదిక కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు సచివాలయంలో ఆందోళన విరమించారు. సచివాలయం నుంచి ఉద్యోగ సంఘాలు వెనుదిరిగారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. ఈ రోజు పీఆర్సీ నివేదిక కోసం ఆరుగంటల పాటు ఎదురుచూశామన్నారు. తామంతా ప్రభుత్వంపై నమ్మకంతో ఉన్నామని చెప్పారు. ప్రభుత్వం తమకు అన్యాయం చేయదని భావిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. పీఆర్సీ విషయంలో ఇప్పటికే సీఎస్ ఒఎస్డీకి కూడా తాము ఫోన్ చేసినట్టు చెప్పారు.
శశిభూషణ్ కుమార్ వచ్చి తమతో మాట్లాడతారని ఆయన చెప్పారని బండి శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. శశిభూషణ్ కుమార్‌కి తాము ఫోన్ చేసినా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. సచివాలయంలో నిరసనతో పోలీసులపై ఒత్తిళ్లు వస్తున్నాయని, పోలీసులకు సహకరించాలని తాము ఆందోళన విరమిస్తున్నారు. పీఆర్సీ నివేదిక తీసుకుందామనే వచ్చామని, కానీ, నిరసన చేసేందుకు కోసం కాదన్నారు. గురువారం ఉద్యోగ సంఘాలు సమావేశమవుతాయని, తదుపరి ఏం చేయాలనే విషయమై నిర్ణయిస్తామన్నారు.
మా సహనాన్ని పరీక్షిస్తున్నారు : జేఏసీ బొప్పరాజు
మాపట్ల కనీస విలువలు, గౌరవం పాటించలేదని జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు అసహనం వ్యక్తం చేశారు. పీఆర్సీ నివేదిక ఇస్తారా లేదా అని చెప్పకుండా మా సహనాన్ని పరీక్షించారని, ఇది మంచి పరిణామంకాదున్నారు. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య గ్యాప్ సృష్టించేలా ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అధికారుల వైఖరి సరిగా లేదన్నారు. గురువారం (నవంబర్ 11) ఇరు జెఎసీలు సమావేశమై కార్యాచరణ రూపొందిస్తామన్నారు. సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసుల క్రమబద్దీకరణ సహా ఇతర అంశాలపై చర్చించి పోరాట కార్యాచరణ ప్రకటిస్తామని బొప్పరాజు పేర్కొన్నారు. బొప్పరాజుతో జీఏడి సెక్రెటరీ శశిభూషన్ ఫోన్ లో మాట్లాడారు. రేపు (గురువారం) కూడా పీఆర్సీ నివేదిక అందజేయలేమవి శశి భూషన్ స్పష్టం చేసినట్టు తెలిసింది. దాంతో తదుపరి కార్యాచరణకు ఉద్యోగ సంఘాలు సిద్దమౌతున్నాయి.
Read Also : Wi-Fi HaLow : సరికొత్త వై-ఫై టెక్నాలజీ వస్తోంది.. కిలోమీటర్ దూరంలోనూ Wi-Fi కనెక్ట్ కావొచ్చు!