నేను ఖర్చు పెట్టేది.. నా రాష్ట్రంలోని పిల్లలపైనే: జగన్

  • Published By: srihari ,Published On : May 27, 2020 / 08:05 AM IST
నేను ఖర్చు పెట్టేది.. నా రాష్ట్రంలోని పిల్లలపైనే: జగన్

Updated On : May 27, 2020 / 8:05 AM IST

విద్యారంగ సంస్కరణలపై ఏపీ సీఎం జగన్ సమీక్షించారు. మూడో రోజు ‘మన పాలన- మీ సూచన’ కార్యక్రమంలో భాగంగా విద్యారంగంపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్షించారు. మంత్రులు, అధికారులు, లబ్ధిదారులతో ఆయన చర్చించారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలు దారుణంగా ఉన్నాయని అన్నారు. పాదయాత్రలో విద్యార్థుల అవస్థలు తెలుసుకున్నానని చెప్పారు. గత ప్రభుత్వం అధ్వాన్నంగా ఉన్న పాఠశాలలను బాగు చేయాలనే ఆలోచన చేయలేదని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివించకూడదు అనే స్థితికి తీసుకొచ్చారని చెప్పారు.

ఇప్పుడు ఎక్కడ చూసినా మనకు ఇంగ్లీష్ భాషే కనిపిస్తోందని జగన్ గుర్తు చేశారు. ఇంగ్లీష్ మీడియం వద్దన్న వాళ్ల పిల్లలు ఎక్కడ చదువుతున్నారని జగన్ సూటిగా ప్రశ్నించారు. ఇంగ్లీష్ మీడియం కావాలని అంటుంటూ వద్దని కొందరు అంటున్నారని అన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివించడం వేస్ట్ అనుకునేవారికి ప్రైవేటు స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ఉంటుందన్నారు. అలాగే ప్రభుత్వ స్కూళ్లలోనే తెలుగు మీడియం ఉంటుందని తెలిపారు. చాలా స్కూళ్లలో బాత్రూములు సరిగా ఉండేవి కావన్నారు. బిల్డింగ్‌లు అద్వాన్నంగా ఉండేవని చెప్పారు. నేను ఖర్చు పెట్టేది నా రాష్ట్రంలోని పిల్లలపైనేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 33 శాతం చదువురాని వారే ఉన్నారని చెప్పారు.

దేశంలో చదువు రాని వారు 27 శాతం ఉన్నారని, 25 శాతం పిల్లలు మాత్రమే పై చదవులకు వెళ్తున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు చేస్తున్నామని అన్నారు. పెరుగుతున్న సాంకేతికతకు అనుగుణంగా విద్యా భోదన కొనసాగాలని చెప్పారు. నా రాష్ట్ర పిల్లల కోసమే పెట్టుబడి పెడుతున్నానని అన్నారు. ఫీజులు కట్టలేక చాలామంది మధ్యలోనే చదువును మధ్యలోనే వదిలేస్తున్నారని అన్నారు. ప్రైవేటు స్కూళ్లలో చదివేవారే ఇంగ్లీష్ మీడియం చదవాలా? అని ప్రశ్నించారు.

ప్రభుత్వ స్కూళ్లలో చదివేవారు కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివేవారు కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలన్నారు. చదవించకపోతే పేదరికంలో ఉన్నవాళ్లు పేదరికంలోనే ఉంటారని తెలిపారు. ఉన్నత విద్యలో మనం ఇంకా వెనుకబడే ఉన్నామని తెలిపారు. చదవు ఒక్కటే పేదరిక నిర్మూలనకు సరైన పరిష్కారమన్నారు. ప్రభుత్వ స్కూళ్ల నుంచే మార్పు రావాలని అనుకున్నామని జగన్ స్పష్టం చేశారు. అందుకే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తీసుకురావాలనుకున్నామని తెలిపారు. 

ఇంగ్లీష్ మీడియంపై తల్లిదండ్రుల అభిప్రాయాలను కూడా తీసుకున్నామని తెలిపారు. పిల్లల తల్లిదండ్రుల యునానిమస్‌గా ఒప్పుకున్నామన్నారు. రాజకీయ నాయకుల వల్ల చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. మేం ప్రవేశపెట్టిన ప్రతీ బిల్లును అడ్డుకున్నారని తెలిపారు. ఇంగ్లీష్ మీడియం వస్తే తెలుగును అగౌరవ పరుస్తామని చెబుతారని జగన్ అన్నారు. ప్రశ్నించే వారి పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలోనే చదవుతారని జగన్ అన్నారు. పేదలవాళ్లు ఎప్పటికీ గొప్పవాళ్లు కాకూడదనే ఆలోచనతోనే ఉన్నారని, అందుకే కోర్టు ద్వారా ఇబ్బందులు సృష్టించాలని చూశారని చెప్పారు.

అయినా మన ప్రభుత్వానిదే పైచేయి సాధించిందని సీఎం చెప్పారు. ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి తల్లిదండ్రుల అభిప్రాయాలను తీసుకున్నామని, దాదాపు 40 లక్షల మంది అభిప్రాయాలను తీసుకుంటే..  96 శాతం మంది తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియంకు ఒప్పుకున్నారని తెలిపారు. పేదరికం నుంచి బయట పడాలంటే కుటుంబం నుంచి ఒకరు ఇంజినీరో, డాక్టరో కావలన్నారు. అందరికి ప్రైవేటు స్కూళ్లలో చదివే పరిస్థితి ఉండదన్నారు. అందుకే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తీసుకోవచ్చామని తెలిపారు. పిల్లలకు బ్రిడ్జ్ కోర్సులను కూడా ప్లాన్ చేసినట్టు చెప్పారు. 

ముందుగా 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం స్కూళ్లను ప్రవేశపెడతామన్నారు. ప్రతి స్కూళ్లలోనే బాత్రూమ్ లు, స్వచ్ఛమైన నీరు, ఫర్నీచర్, ఫ్యాన్లు, పేయింటింగ్, కాంపౌడ్ వాల్స్, ల్యాబ్స్ ఉండేలా చర్యలు చేపట్టినట్టు జగన్ చెప్పారు. తర్వాత అన్ని స్కూళ్లలో సౌకర్యాలు మెరుగుపరుస్తామన్నారు. పిల్లల చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదని అన్నారు. ఒక్కో ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ పోతామని తెలిపారు. ప్రభుత్వ స్కూళ్ల రూపు రేఖలు పూర్తిగా మార్చేస్తామన్నారు. నాడు నేడులో తొలివిడతలో భాగంగా 15,715 స్కూళ్లలో 9 రకాల వసతులతో రూపురేకలు మార్చబోతున్నామని తెలిపారు. మూడేళ్లలో 47,656 పాఠశాలలను పూర్తిగా మార్చబోతున్నామని జగన్ స్పష్టం చేశారు. 

గత ప్రభుత్వం ఫీజు రియింబర్స్‌మెంట్‌ అరకొరగా ఇచ్చిందని విమర్శించారు. ఆ అరకొరలో కూడా రూ.1880 కోట్ల బకాయిలు పెట్టిందని, ఈ బకాయిలతో పాటు.. ఒకేసారి రూ.4,200 కోట్లు విడుదల చేశామన్నారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చెల్లింపులు చేశామని జగన్ వెల్లడించారు. నూటికి నూరు శాతం పిల్లల ఫీజులు చెల్లించామని వైస్ జగన్ స్పష్టం చేశారు. 

Read: ఏపీలో ఆగస్టు 3 నుంచి స్కూళ్లు రీఓపెన్