Krishna River : ఏటూరులో విషాదం.. కృష్ణా నదిలో ఐదుగురు విద్యార్థులు గల్లంతు

కృష్ణా జిల్లాలోని చందర్లపాడు మండలం ఏటూరులో సోమవారం విషాదం నెలకొంది. కృష్ణా నదిలో ఈతకెళ్లిన ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు.

Krishna River : ఏటూరులో విషాదం.. కృష్ణా నదిలో ఐదుగురు విద్యార్థులు గల్లంతు

Five Students Missing In Krishna River At Eturu

Updated On : January 10, 2022 / 10:28 PM IST

Krishna River : కృష్ణా జిల్లాలోని చందర్లపాడు మండలం ఏటూరులో సోమవారం విషాదం నెలకొంది. కృష్ణా నదిలో ఈతకెళ్లిన ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. సంక్రాంతి సెలవులు కావడంతో విద్యార్థులు ఈతకొట్టేందుకు ఈ రోజు మధ్యాహ్నం ఇంటి నుంచి మున్నేరు వాగులో ఈతకొట్టేందుకు వెళ్లారు.

రాత్రి అవుతున్నా ఇంకా తమ పిల్లలు ఇంటికి తిరిగి రాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. నది ఒడ్డున విద్యార్థుల బట్టల ద్వారా గల్లంతైన పిల్లలను పోలీసులు గుర్తించారు.

గల్లంతైన విద్యార్థుల్లో బాలయేసు, చరణ్, అజయ్, రాకేశ్, సన్నీగా పోలీసులు తెలిపారు. నది ఒడ్డున ఉన్న విద్యార్థుల బట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గల్లంతు అయినా విద్యార్థులు 8ఏళ్ల నుంచి 13ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారేనని పోలీసులు వెల్లడించారు.

గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్టు పేర్కొన్నారు. విద్యార్థులు గల్లంతైన విషయం తెలిసిన వారి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు.

Read Also : AP Night Curfew : ఏపీలో నైట్ కర్ఫ్యూ.. అమల్లోకి వచ్చిన నిబంధనలు!