Food Poisoning 26 Students Ill : కస్తూర్బా బాలికల కాలేజీలో ఫుడ్ పాయిజన్.. 26 మంది విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత
అనంతపురం జిల్లా శింగనమల కస్తూర్బా బాలికల కాలేజీలో ఫుడ్ పాయిజన్ అయింది. 26 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

Food poisoning
Food Poisoning 26 Students Ill : అనంతపురం జిల్లా శింగనమల కస్తూర్బా బాలికల కాలేజీలో ఫుడ్ పాయిజన్ అయింది. 26 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను ఎమ్మెల్యే పద్మావతి పరామర్శించారు.
ఫుడ్ పాయిజన్ కు గల కారణాలను తెలుసుకున్నారు. అయితే మజ్జిగలో బల్లి పడినట్లు విద్యార్థినులు చెబుతున్నారు. అంతకముందు పరామర్శకు వచ్చిన ఎమ్మెల్యే పద్మావతిని ఎస్ ఎఫ్ ఐ విద్యార్థి నేతలు అడ్డుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే పద్మావతితో ఎస్ ఎఫ్ ఐ నేతలు వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా లాక్కెళ్లారు.