Yerra Narayanaswamy: ఏపీ మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి కన్నుమూత
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వై.నారాయణస్వామి (92) కన్నుమూశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.

Y.Narayanaswamy
Yerra Narayanaswamy : ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి (92) కన్నుమూశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. నారాయణస్వామి 1972లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. తరువాత 1992లో తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ సభ్యులుగా నారాయణస్వామి పని చేశారు.
నారాయణస్వామి స్వగ్రామం ఉండి మండలం ఉప్పులూరు. 1985, 1999లలో రెండు సార్లు టీడీపీ నుండి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా యర్రా నారాయణ స్వామి గెలిచారు. 1994 – 99 మధ్య రాజ్యసభ సభ్యుడిగా నారాయణ స్వామి పని చేశారు.
Girish Bapat: బీజేపీకి బిగ్ లాస్.. పార్టీ ఎంపీ గిరిష్ బాపట్ మరణం
ప్రస్తుత టీడీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి చిన్నాన్న యర్రా నారాయణ స్వామి. నారాయణస్వామి మృతికి టీడీపీతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.