Gold Rate : బంగారం కొంటున్నారా..? అయితే మీకు షాకింగ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఇలా..

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో

Gold Rate : బంగారం కొంటున్నారా..? అయితే మీకు షాకింగ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఇలా..

Gold

Updated On : May 15, 2024 / 11:52 AM IST

Gold and Silver Rate Today : అక్షయ తృతీయ తరువాత నెమ్మదించిన బంగారం ధర మళ్లీ ఇవాళ (బుధవారం) పెరిగింది. యూఎస్ ఉత్పత్తి గణాంకాలు అంచనాలను మించి నమోదు కావడం, ఇవాళ విడుదలయ్యే ద్రవ్యోల్బణం డేటా అధికంగా ఉండొచ్చనే అంచనాలు రావడంతో గోల్డ్ కు డిమాండ్ పెరిగింది. దీంతో గత రెండు రోజుల్లో ఒకశాతం పతనమైన గోల్డ్ రేటు మళ్లీ పుంజుకుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ ఔన్స్ గోల్డ్ 2350 డాలర్లు పలుకుతుంది. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. దేశంలో 10గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 400 పెరగ్గా, 24 క్యారెట్ల బంగారంపై రూ. 430 పెరిగింది. వెండి ధరసైతం పెరిగింది. ఇవాళ కిలో వెండిపై రూ. 300 పెరిగింది.

 

  • తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,150కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.73,250.
  • దేశంలోని ప్రధాన నగరాల్లో ..
    దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.67,300 కాగా, 24 క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 73,400.
    ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.67,150 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 73,250.
    చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.67,250 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ రూ.73,360.

 

  • వెండి ధర ఇలా ..
    దేశ వ్యాప్తంగా వెండి ధర భారీగా పెరిగింది. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.
    తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.91,000.
    దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ. 91,000.
    కోల్ కత్తా, ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.87,600.
    బెంగళూరులో కిలో వెండి ధర రూ. 86,500 వద్ద కొనసాగుతుంది.

 

  • పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.