ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త!

AP govt employees : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏల చెల్లింపునకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
డీఏల చెల్లింపునకు కార్యాచరణను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. జులై 2018 నాటి మొదటి డీఏను జనవరి జీతాల్లో చెల్లించాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు.
మొదటి డీఏ చెల్లింపు ద్వారా ఏపీ ప్రభుత్వ ఖజానాపై రూ.1035 కోట్ల అదనపు భారం పడనుంది. జనవరి 2019 నాటి రెండో డీఏను 2021 జులై జీతాల్లో చెల్లించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
రెండో డీఏ చెల్లింపు ద్వారా రూ.2074 కోట్ల అదనపు భారం పడనుంది. జులై 2019 నాటి మూడో డీఏను 2022 జనవరి నుంచి చెల్లించాలని ఆదేశించగా.. మూడో డీఏ చెల్లింపు ద్వారా ప్రభుత్వ ఖజానాపై రూ.3802 కోట్ల అదనపు భారం పడనుంది.