Gossip Garage : భవిష్యత్తులో రాజధానిని మార్చే అవకాశం లేకుండా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్..!
క్యాపిటల్ విషయంలో గత ఐదేళ్లలో జరిగిన గందరగోళానికి చెక్ పెట్టాలని కూటమి సర్కార్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

Gossip Garage Ap Capital Amaravati (Photo Credit : Google)
Gossip Garage : నో డౌట్. ఏపీ రాజధాని అమరావతే. నవ్యాంధ్రగా ఏర్పడి పదేళ్లు అయినా ఎన్నాళ్లీ గొడవ. మూడు రాజధానులు అని ఓసారి..అమరావతే క్యాపిటల్ అని ఓసారి.. ఏంటీ కన్ఫ్యూజన్. ఇలా అయితే అభివృద్ధి అయ్యేదెప్పుడు.? నవ్యాంధ్ర బాగుపడేదెప్పుడు.? అమరావతే రాజధాని అని అందరికీ క్లారిటీ రావాల్సిందే. ప్రభుత్వాలు మారినా..అధికారంలో ఎవరున్నా ఏపీ రాజధాని అమరావతే. ఇక మార్పు ఉండదు. మార్చడాలు అసలే కుదరదు అంటూ..అమరావతికి కేంద్రం ఆమోదముద్ర పడాల్సిదేనంటోంది కూటమి ప్రభుత్వం. గెజిట్ వస్తేనే రాజధాని ఫ్యూచర్‌కు ఢోకా ఉండదా.? అధికార ముద్ర పడితే అభివృద్ధి పరుగులు పెట్టడం ఖాయమా.?
ఫ్యూచర్‌లో రాజధానిని మార్చే అవకాశం లేకుండా ప్లాన్..
కన్ఫ్యూజన్ వద్దు. అపోహలు అవసరం లేదు. గత ఐదేళ్లలో జరిగిన డ్యామేజ్ చాలు. మళ్లీ అలాంటి సీన్ రిపీట్ కాదు కానివ్వం. ఏపీ రాజధాని అమరావతే. ఇదే శాసనం. అదే కూటమి సర్కార్ నిర్ణయమంటున్నారు ప్రభుత్వ పెద్దలు. రాజధాని విషయంలో డౌట్స్ వద్దంటున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి. ఇది ఫిక్స్ అయిపోండని చెప్తోంది ప్రభుత్వం. మూడు రాజధానుల ముచ్చట ఒడిసిన కథ అని..గత సర్కార్ చేసిన దానికి జరిగిన నష్టం చాలంటోంది. రాజధాని విషయంలో భవిష్యత్‌లో ఇక మార్పులు ఉండవు. రాజధానిని మార్చడానికి అవకాశం కూడా లేకుండా చేస్తామంటోంది. అందుకోసం అమరావతే ఏపీ రాజధాని అని కేంద్రం ఆమోదముద్ర వేసేలా కసరత్తు చేస్తోంది.
వైసీపీ ప్రభుత్వం రావడంతో మసకబారిన రాజధాని ప్రభ..
విభజన తర్వాత ఏపీలో పవర్‌లోకి వచ్చిన టీడీపీ..అమరావతే రాజధాని అని శాసనసభలో తీర్మానం చేసింది. టీడీపీ అయిదేళ్ళ పాలనలో అమరావతి రాజధానిగానే చాలా కార్యక్రమాలు చేపట్టారు. క్యాపిటల్ సిటీ నిర్మాణంపై గొప్పగా డిజైన్లు తీర్చిదిద్దారు. అమరావతిని ప్రపంచ రాజధానిగా చేయాలని ప్లాన్స్ రూపొందించారు. ఏకంగా నవ నగరాలను అమరావతిలో నెలకొల్పాలని కూడా అంతా సిద్ధం చేశారు. ఆలోగా వైసీపీ ప్రభుత్వం రావడంతో అమరావతి రాజధాని ప్రభ మసకబారింది. దానికి బదులుగా మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను ముందుకు తెచ్చింది వైసీపీ. అలా ఏపీ రాజధాని ఏంటో క్లారిటీ లేక జోకులు వేసుకునే పరిస్థితి ఉండేది. గత సర్కార్ పుణ్యమా అని టీడీపీ హయాంలో చేపట్టిన అమరావతి రాజధాని పనులన్నీ ఆగిపోయాయి. అమరావతి క్యాపిటల్‌గా ఉండదేమోనని వచ్చే ఇన్వెస్టర్లు కూడా రాలేదు. గతంలో చేపట్టిన ప్రాజెక్టులు మూలకు పడ్డాయి. ఓ రకంగా క్యాపిటల్ సిటీ కల తప్పింది.
అమరావతి రాజధాని అని కేంద్రం నుంచి గెజిట్ తెచ్చే ప్రయత్నం..
కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధాని పనుల మీద యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. అంతేకాదు అమరావతికి సంబంధించి..రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పరిచయంతో ప్రపంచ బ్యాంక్ నిధులను రూ.15వేల కోట్లు తెచ్చుకుంటోంది. మరో 12 వేల కోట్ల రూపాయలు వివిధ ఏజెన్సీల ద్వారా వస్తాయని కూడా చెబుతోంది. అయితే ఈ రోజుకీ ఏపీ రాజధాని అమరావతి అని గెజిట్ నోటిఫికేషన్ లేదు అని అంటున్నారు. దీని మీద విశాఖకు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి ఒకరు..ఏపీకి అమరావతి రాజధాని అని గెజిట్ నోటిఫికేషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేయాలంటూ సీఎస్‌కు లేఖ రాశారు.
అమరావతి రాజధాని అని కేంద్రం గెజిట్ ఇస్తే అన్ని ఇబ్బందులకు చెక్.!
ఏపీకి రాజధాని అమరావతి అని కేంద్రం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తేనే అన్ని రకాలుగా ఇబ్బందులు తొలగిపోతాయి. ఇన్వెస్టర్లకు, పారిశ్రామికవేత్తలకు, ప్రజలకు అందరికీ ఓ క్లారిటీ వస్తుంది. ప్రభుత్వాలు, నేతలతో సంబంధం లేకుండా అమరావతి దానంతట అదే డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే అమరావతే ఏపీ రాజధాని అని కేంద్రం నుంచి అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది కూటమి సర్కార్. మంత్రి నారాయణ కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు.
డిసెంబర్ చివరి నాటికి రాజధానిపై కేంద్రం గెజిట్ వచ్చే అవకాశం..
ఏపీ ప్రభుత్వం తమ వంతు ప్రయత్నాలు మొదలు పెట్టిందని ఆయన అంటున్నారు. కూటమిలో టీడీపీ కీలకంగా ఉంది. మోదీతో చంద్రబాబు చాలా సఖ్యతతో మెలుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాజధాని విషయంలో కేంద్రం నుంచి గెజిట్ తెచ్చే ప్రాసెస్ వేగంగా జరుగుతోన్నట్లు తెలుస్తోంది. కేంద్ర పెద్దలతో భేటీలో చంద్రబాబు గెజిట్ ప్రస్తావన తెచ్చారని..అందుకు వాళ్లు సానుకూలంగా స్పందించారని అంటున్నారు. అంతా అనుకున్నట్లు జరిగే డిసెంబర్ చివరి నాటికే ఏపీ రాజధాని అమరావతి అని కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం ఖాయమంటున్నారు.
రాజధాని విషయంలో గందరగోళం లేకుండా ప్లాన్..
క్యాపిటల్ విషయంలో గత ఐదేళ్లలో జరిగిన గందరగోళానికి చెక్ పెట్టాలని కూటమి సర్కార్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా రాజధాని మీద కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ప్రకటించేలా చేసి..కన్ఫ్యూజన్‌కు చెక్ పెట్టాలని డిసైడ్ అయింది. కేంద్రం గెజిట్ ఇస్తే ఏ డౌట్స్ ఉండవని..అప్పుడు రాజధాని నిర్మాణం మీద ఫుల్ ఫోకస్ చేయొచ్చని భావిస్తోంది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే రాజధాని అభివృద్ధి అంతా ఆగిపోయిందని.. ఫ్యూచర్‌లో రాజధానిని మారుస్తారేమోనన్న ఊహాగానాలకు ఇప్పుడైనా చెక్ పెడితే.. అభివృద్ది దానంతట అదే జరిగిపోతుందని అనుకుంటోంది ఏపీ సర్కార్. డిసెంబర్ నెలాఖరు వరకు వరల్డ్ బ్యాంకు నుంచి మొదటి విడత నిధులు వస్తాయని..అదే సమయంలో కేంద్రం గెజిట్ ఇస్తే ఇక పనుల జోరు పెంచొచ్చని అంటున్నారు అధికారులు.
Also Read : రాజ్యసభకు నాగబాబు? కూటమి నుంచి పెద్దల సభకు వెళ్లే ఆ ముగ్గురు అదృష్టవంతులు వీరేనా?