ప్రజా తీర్పు రోజే వెన్నుపోటు దినం.. వైసీపీ తీరుపై విమర్శలు..

వైసీపీ తమ ఓటమిని సమీక్షించుకుని..సమస్యలపై పోరాడకుండా..కూటమి ఇచ్చిన హామీలతో ముడిపెట్టడం ఏంటన్న చర్చ జరుగుతోంది.

ప్రజా తీర్పు రోజే వెన్నుపోటు దినం.. వైసీపీ తీరుపై విమర్శలు..

YS Jagan

Updated On : June 6, 2025 / 10:38 AM IST

Gossip Garage: సరిగ్గా ఏడాది కింద. 151 సీట్ల నుంచి వైసీపీ 11 సీట్లకు పడిపోయింది. కూటమి ప్రభంజనం సృష్టించి 164 సీట్లతో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడా హస్టారికల్‌ డే రోజున.. అటు వైసీపీ ఇటు కూటమి నువ్వా నేనా అన్నట్లుగా పొలిటికల్‌ ఫైట్‌కు దిగాయి. కూటమి గెలిచిన రోజున ఫ్యాన్‌ పార్టీ నిరసనలు చేస్తే.. పీడ విరగడై.. ప్రజాస్వామ్యం గెలిచిన రోజని టీడీపీ, జనసేన సంబరాలు చేసుకున్నాయి. వైసీపీ నిరసనలకు ఇది సరైన టైమ్ కాదా? గ్రౌండ్‌లో సిచ్యువేషన్‌ను అంచనా వేయకుండానే.. ప్రొటెస్ట్‌లకు దిగారా? జనం ఏం అనుకుంటున్నారు? జగన్‌ అభిప్రాయమేంటి?

వైసీపీకి క‌లలో కూడా ఊహించ‌ని దెబ్బ త‌గిలిన రోజు..
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటితో స‌రిగ్గా ఏడాది. 2024 జూన్ 4. ఈ డేట్‌ ఏపీ రాజ‌కీయాల్లో చ‌రిత్ర సృష్టించిన రోజు. వైనాట్ 175 అంటూ అధికారంపై గ‌ట్టి ధీమాతో ఉన్న వైసీపీకి క‌లలో కూడా ఊహించ‌ని దెబ్బ త‌గిలిన రోజు. 164 అసెంబ్లీ సీట్లు, 21 పార్లమెంట్ సీట్లు గెలుచుకుని కనీవినీ ఎరుగని రీతిలో కూట‌మి అధికారంలోకి వ‌చ్చి వన్‌ ఇయర్‌ అయింది. ఈ స్పెష‌ల్ డేను కూట‌మి పార్టీలు ముఖ్యంగా టీడీపీ, జనసేన సంబ‌రంగా జ‌రుపుకోగా..వైసీపీ మాత్రం నమ్మించి ప్రజలను మోసం చేశారంటూ ఆందోళనలు చేసింది.

జూన్ 4.. ప్రజాతీర్పు దినం అంటూ టీడీపీ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేసింది. మ‌రోవైపు జూన్ 4ను వెన్నుపోటు దినమంటూ కూట‌మి ప్రభుత్వంపై పోరుబాట పట్టింది వైసీపీ. సూపర్-6 చంద్రబాబు, ప‌వ‌న్‌కు బంగారు బాతులా మారిపోయిందని..మీ ద్రోహాన్ని రాష్ట్ర ప్రజలు మర్చిపోరంటూ ఫ్యాన్ పార్టీ విమ‌ర్శిస్తూ వస్తోంది. జ‌గ‌న్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇచ్చిన అన్ని హామీలన్నీ అమలు చేశామని..ఇప్పుడు కూటమి పాలనకు ఏడాది పూర్తి అయినా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదంటోంది వైసీపీ.

ప్రజాతీర్పును వెన్నుపోటు దినంగా పిలుపునివ్వడం ఏంటి?
అయితే ప్రజాతీర్పును శిరసావహించి..లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకోవాల్సిందిపోయి..జూన్‌ 4న వెన్నుపోటు దినంగా పిలుపునివ్వడం ఏంటని ప్రశ్నిస్తోంది టీడీపీ. తీర్పు చెప్పిన ప్రజలను వెన్నుపోటుదారులుగా చిత్రీకరిస్తున్నారని మండిపడుతోంది. వైసీపీ నిరసనలు, ఆ నిరసనలకు పెట్టిన పేరు ప్రజాతీర్పును అపహాస్యం చేయడమేనని అంటున్నారు కూటమి లీడర్లు.

వైసీపీ జూన్ 4న నిరసనలకు పిలుపునివ్వడం రాజకీయ వ్యూహమే కావొచ్చు. తన పార్టీ శ్రేణులను ఉత్సాహపరచడానికి, ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకతను క్రియేట్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. అయితే ఎన్నికల ఫలితాలు ప్రజాతీర్పును ప్రతిబింబిస్తాయని..అలాంటి తీర్పు రోజును వెన్నుపోటు దినమని చెప్పడం ఏంటంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వైసీపీ తమ ఓటమిని సమీక్షించుకుని..సమస్యలపై పోరాడకుండా..కూటమి ఇచ్చిన హామీలతో ముడిపెట్టడం ఏంటన్న చర్చ జరుగుతోంది. ఎన్నికల ఫలితాల రోజును వెన్నుపోటు దినంగా నిర్వహించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకమంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. ఎన్నికల్లో కూటమి 164 సీట్లు సాధించగా, వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితమైంది. ఈ ఫలితాలు ప్రజలు వైసీపీ పాలనపై అసంతృప్తిని వ్యక్తం చేసి, కూటమికి స్పష్టమైన మెజారిటీ ఇచ్చినట్లు సూచిస్తున్నాయి.

Also Read: వైసీపీ ప్రభుత్వంలో మనల్ని వేధించారని మనమూ వారిలానే వేధించటం కరెక్ట్ కాదు- సీఎం చంద్రబాబు

ప్రజలు తీర్పు ఇచ్చిన రోజున నిరసనలు తెలపడం ఏంటో?
ఈ తీర్పును వెన్నుపోటుగా ప్రచారం చేయడం ద్వారా, ప్రజాతీర్పే తప్పు అని చెప్పినట్లుగా అవుతుందని అంటున్నారు. ఒకవేళ నిరసనలు చేపట్టాలంటే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన రోజు ప్రొటెస్ట్ చేయాలి కానీ..ప్రజలు తీర్పు ఇచ్చిన రోజున నిరసనలు తెలపడం ఏంటో అర్థం కావడం లేదంటున్నారు. పైగా..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కూడా పూర్తి కాకముందే విఫలమైందని అనడం కూడా తొందరపాటే అంటున్నారు. ఏ ప్రభుత్వమైనా ఆర్థిక వెసులుబాటు చూసుకుని..హామీలను అమలు చేయడానికి కనీసం రెండేళ్లు పడుతుందన్నది మర్చిపోవద్దంటున్నారు.

ఘోర ఓటమి తర్వాత వైసీపీ తీవ్ర నిరాశ, నిస్పృహల్లోకి వెళ్లిపోయింది. నేతల వరుస అరెస్టులు, కేసులు..పైగా అప్పటి వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై కూటమి ప్రభుత్వం చేపట్టిన విచారణలు..ఫ్యాన్‌ పార్టీకి ఇబ్బందిగా మారాయి. చాలామంది నేతలు జగన్‌ను, వైసీపీని విడిచి వెళ్లిపోయారు. ఉన్న కొంతమంది నేతలు కూడా నియోజకవర్గాలకు వెళ్లడం లేదు. పార్టీ యాక్టివిటీని స్పీడప్ చేస్తున్నట్లు కనిపించడం లేదు.

కూటమిపై అప్పుడే అంత ప్రజా వ్యతిరేకత రాలేదన్న మాట వాస్తవం…!
ఇలాంటి సమయంలో జగన్‌ నిరసనలకు పిలుపునివ్వడం ఓ రకంగా తన పార్టీ క్యాడర్, లీడర్లలో జోష్‌ నింపడానికే అయినా..ఇది సరైన టైమ్‌ కాదన్నది పొలిటికల్‌ ఎక్స్‌పర్ట్స్‌ అభిప్రాయం. వైసీపీలో కూడా ఇవే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయట. అయితే ఇవేం పట్టించుకోకుండానే..నిరసనలు చేశారు..ప్రజల నుంచి స్పందన రాలేదంటున్నారు కూటమి నేతలు. జగన్ చేసిన అరాచకాలేంటో జనాలకే ఎక్కువగా తెలుసంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఈ నిరసనలకు వైసీపీ సాధించిందేంటో తెలియదు కానీ..కూటమిపై అప్పుడే అంత ప్రజా వ్యతిరేకత రాలేదన్న మాట వాస్తవం.