Gossip Garage : పార్టీ ఆఫీస్‌ను కూడా ఎత్తేసిన జిల్లా పెద్దలు.. దిక్కుతోచని స్థితిలో వైసీపీ క్యాడర్

మిగిలిన మాజీ ఎమ్మెల్యేలు.. పార్టీ ఆఫీస్ లేదనే సాకుతో జిల్లా కేంద్రం వైపు కూడా రావడం లేదనే ఆందోళన కేడర్‌లో వినిపిస్తోంది..

Gossip Garage : పార్టీ ఆఫీస్‌ను కూడా ఎత్తేసిన జిల్లా పెద్దలు.. దిక్కుతోచని స్థితిలో వైసీపీ క్యాడర్

Updated On : December 24, 2024 / 11:30 PM IST

Gossip Garage : ఐదేళ్లు పదవులు అనుభవించారు. ఎదురులేని దర్జా ప్రదర్శించారు. వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్‌ మెంబర్ వరకు అందరూ జిల్లాలో గిర్రున తిరుగుతూ బిజీగా కనిపించే వారు. సీన్ కట్ చేస్తే పవర్ కట్ అయిన ఫ్యాన్‌లా అయిపోయింది ఆ జిల్లా నేతల పరిస్థితి. క్యాడర్‌కు నేతల దర్శనమే మహాభాగ్యమైంది.. పోని పార్టీ ఆఫీస్‌కు వెళ్దామంటే అది కూడా ఎత్తేశారు. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ ఎదురీతపై లోకల్‌ గాసిప్‌..

ఏపీలో సిక్కోలు రాజకీయం ఎప్పుడూ హాట్‌హాట్‌గా ఉంటుంది. అధికారపక్షమైనా.. ప్రతిపక్షమైనా శ్రీకాకుళం జిల్లా నుంచి కీలక నేతలు కనిపిస్తుంటారు. కానీ 2024 ఎన్నికల తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. జిల్లా వైసీపీ నేతలు సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. వైసీపీ నేతల దర్శనమే భాగ్యమైపోయింది.

Dharmana Prasada Rao

Dharmana Prasada Rao

2019 ఎన్నికల్లో వైసీపీకి బ్రహ్మరథం పట్టిన సిక్కోలు ప్రజలు…
నిజానికి 2019 ఎన్నికల్లో వైసీపీకి బ్రహ్మరథం పట్టారు సిక్కోలు ప్రజలు. జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలుంటే.. ఎనిమిది స్థానాల్లో వైసీపీని గెలిపించారు. గెలిచిన నేతల్లో ధర్మాన సోదరులు, సీదిరి అప్పలరాజు, తమ్మినేని సీతారాం కీలక పదవులను దక్కించుకున్నారు. దీంతో జిల్లా కేంద్రం ఎప్పుడు చూసినా హడావిడిగా కనిపించేది. జిల్లా పార్టీ ఆఫీస్ అయితే.. మూడు ప్రెస్‌మీట్లు, ఆరు రివ్యూ మీటింగ్‌లతో ఆ కళే వేరు అన్నట్లుగా ఉండేది.

Also Read : ఫైర్ ఎవరు? ఫ్లవర్ ఎవరు? గవర్నమెంట్ వర్సెస్ గ్లామర్ ఫీల్డ్..

సీన్ కట్ చేస్తే.. మొన్నటి ఎన్నికల్లో పవర్ కట్ అయ్యింది. వైసీపీ వైభవం నెమ్మదిగా సన్నగిల్లుతోంది. ఈసారి పది స్థానాల్లో ఓటమిని మూటగట్టకుంది. కీలక నేతలంతా ఇంటి బాటపట్టారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు.

పార్టీ ఆఫీస్ కూడా లేకపోవడంతో ఆవేదనలో క్యాడర్..
అధికారం పోయింది. పదవులు లేవు. ఇక అప్పటి నుంచి జిల్లా కేంద్రం వైపు కన్నెత్తి చూసే నాయకులే లేరు. జిల్లా నాయకులు ముఖం చాటేయడంతో పార్టీ ఆఫీస్‌ను కూడా ఎత్తేశారు. మొదట బోర్డు తొలగిస్తే.. ఇప్పుడు జిల్లా పార్టీ ఆఫీస్‌ను నేలమట్టం చేశారు యజమానులు. అసలే వైసీపీ నేతల దర్శనం లేక క్యాడర్ ఇబ్బంది పడుతోంది. ఇటు పార్టీ ఆఫీస్ కూడా లేకపోవడంతో తమ బాధ ఎవరికి చెప్పుకోవాలని వైసీపీ క్యాడర్ మాట్లాడుకుంటోంది.

శ్రీకాకుళం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ధర్మాన ప్రసాదరావు రిటైర్మెంట్ మూడ్‌లో ఉన్నారనేది ఆయన సైడ్‌ నుంచి వినిపిస్తున్న టాక్‌. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన కుమారుడు రామ్‌ మనోహర్ నాయుడు పొలిటికల్ కెరీర్ నిర్మించే పనిలో పడ్డారనేది లోకల్‌ లీడర్స్‌లో జరుగుతున్న చర్చ.. మరోవైపు ఆయన సోదరడు ధర్మాన క్రిష్ణదాస్.. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా తన సొంత నియోజకవర్గం నరసన్నపేటను వీడి బయటకు రావడం లేదు. మిగిలిన మాజీ ఎమ్మెల్యేలు.. పార్టీ ఆఫీస్ లేదనే సాకుతో జిల్లా కేంద్రం వైపు కూడా రావడం లేదనే ఆందోళన కేడర్‌లో వినిపిస్తోంది..

Dharmana Krishna Das

Dharmana Krishna Das (Photo Credit : Facebook)

మరోవైపు పార్టీ అధిష్టానం పిలుపునిచ్చిన కీలక కార్యక్రమాలకు సైతం సీనియర్ నేతలు డుమ్మా కొడుతున్నారనే వాదన వినిపిస్తోంది.. ఒకరిద్దరు నేతలు వచ్చినా రోడ్డు మీదే కార్యక్రమాలు చేసి వెళ్లిపోతున్నారు. జగన్ జన్మదిన వేడుకలు సైతం తూతూ మంత్రంగానే కానిచ్చారనే ప్రచారం జరుగుతోంది.

ఇదిలా ఉండగా.. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాలకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లా ఆఫీస్‌కు సైతం నోటీసులు జారీ చేశారు. దీంతో ఆ కార్యాలయం ఇప్పట్లో పూర్తయ్యేటట్లు కనిపించడం లేదు. వైసీపీ శ్రేణుల కోసమైనా తాత్కాలికంగా ఓ ఆఫీస్‌ ఏర్పాటు చేయాలని క్యాడర్ కోరుకుంటుంది.

Also Read : మంత్రుల్లో కొందరికి ఉద్వాసన తప్పదా..? చంద్రబాబు ర్యాంకింగ్స్ దేనికి సంకేతం..