అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు.. గవర్నర్ ప్రసంగంలో పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్ట్ ప్రస్తావన

"ఇతర రాష్ట్రాలకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్మిస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ సహా అన్ని ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది" అని అన్నారు.

అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు.. గవర్నర్ ప్రసంగంలో పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్ట్ ప్రస్తావన

Governor Abdul Nazeer (Image Credit To Original Source)

Updated On : January 26, 2026 / 12:00 PM IST
  • ఇతర రాష్ట్రాలకు ఇబ్బందులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం
  • అన్ని ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది
  • రైతుల కోసం ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణపై శ్రద్ధ

Governor Abdul Nazeer: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేపట్టిందని గవర్నర్ జస్టిస్‌ అబ్దుల్ నజీర్ అన్నారు. అమరావతిలో తొలిసారి గణంత్ర వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాక గవర్నర్ ప్రసంగించారు.

గవర్నర్ ప్రసంగంలో పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్ట్ అంశం కూడా ఉంది. “ఇతర రాష్ట్రాలకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్మిస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ సహా అన్ని ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రైతుల కోసం ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.

పొలం పిలుస్తోంది.. రైతన్న మీ కోసం. కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రభుత్వం 10 సూత్రాలు అమలు చేస్తూ ముందుకు వెళుతోంది. 63 లక్షల మండికి పైగా సామాజిక పెన్షన్లు అందుతున్నాయి. దీపం పథకంలో సిలిండర్లు అందిస్తున్నాం. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టాం. పాపులేషన్ మెనేజ్మెంట్ పై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది” అని తెలిపారు.

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై ఫోకస్
అమరావతి రాజధాని అభివృద్ధికి పాటుపడుతూనే విశాఖను ఎకనామిక్ జోన్‌గా ఏర్పాటు చేస్తున్నామని గవర్నర్ అన్నారు. “మొదటి సారి విద్యుత్తు శాఖలో ట్రూ డౌన్ చార్జెస్ అమలు చేసి వినియోగదారులపై ప్రభుత్వం భారాన్ని తగ్గించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై ఫోకస్ చేస్తున్నాం.

ఎంఎస్‌ఎంఈల ప్రోత్సాహంతో పాటు ప్లగ్ అండ్ ప్లే విధానంలో ముందుకు వెళ్తున్నాం. ఏపీ టూరిజం పాలసీ అమలు చేసి పర్యాటక రంగ అభివృద్ధిపై దృష్టి పెట్టాం. స్వచ్ఛాంధ్ర, సేఫ్ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అమరావతి క్వాంటం వ్యాలీని త్వరలో ప్రారంభం చేస్తున్నాం. ప్రతి సవాల్‌ను ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నాం. 2047 స్వర్ణాంధ్ర విజన్‌తో ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తోంద” అని గవర్నర్ అన్నారు.