Somu Veerraju : నా కూతురికి నేను పెళ్లి చేయలేదు.. అతడు నా అల్లుడు కాదు.. సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు

నాకు ముగ్గురు కూతుళ్లు... కానీ, ఇద్దరే అల్లుళ్లు అని ఆయన తేల్చి తెలిపారు. పెద్దమ్మాయికి తాను పెళ్లి చేయలేదని ఆయన చెప్పారు.

Somu Veerraju : నా కూతురికి నేను పెళ్లి చేయలేదు.. అతడు నా అల్లుడు కాదు.. సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు

Somu Veerraju

Updated On : January 5, 2022 / 8:34 PM IST

Somu Veerraju : ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అల్లుడిపై చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదైంది అంటూ మీడియాలో వార్తలు రావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై సోము వీర్రాజు స్పందించారు. తన కూతురు, కుటుంబ వ్యవహారాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు ముగ్గురు కూతుళ్లు… కానీ, ఇద్దరే అల్లుళ్లు అని ఆయన తేల్చి తెలిపారు. పెద్దమ్మాయికి తాను పెళ్లి చేయలేదని ఆయన చెప్పారు. తనే పెళ్లి చేసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయిందన్నారు. నేను కాళ్లు కడిగి కన్యాదానం చేయలేదని, కాబట్టి తన కూతురి భర్తను తాను అల్లుడిగా ఇప్పటికీ గుర్తించలేదని స్పష్టం చేశారు.

Cold : జలుబుతో బాధపడుతున్నారా!…ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటే?

అతని క్యారెక్టర్ నాకు నచ్చలేదు అందుకే అతడిని అల్లుడిగా స్వీకరించలేదని వెల్లడించారు. గతంలో నేనే అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాను కానీ తీసుకోలేదని సోమువీర్రాజు గుర్తు చేశారు. ఆ వ్యక్తితో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు సోమువీర్రాజు. దయచేసి ఈ విషయంలో తన పేరు ప్రస్తావించొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని సోమువీర్రాజు స్పష్టం చేశారు.

కాగా, సోము వీర్రాజు కూతురి భర్తపై చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదైంది. తమ ఆస్తి పత్రాలను ఫోర్జరీ చేసి కొవ్వూరు ఎస్బీఐ బ్యాంకులో వెంకట నరసింహం లోన్ తీసుకున్నారని రాజమండ్రికి చెందిన గద్దె జయరామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొవ్వూరు టౌన్ పోలీస్‌స్టేషన్‌లో గత నెల 4న జయరామకృష్ణ ఫిర్యాదు చేయగా.. సోమువీర్రాజు అల్లుడు వెంకట నరసింహంపై ఐపీసీ 406, 419, 420, 465 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Amazon Deal: 48MP స్మార్ట్‌ఫోన్ ఉచితంగా పొందవచ్చు.. ఆఫర్ తెలుసుకోండి!

ఈ కేసుపై సోము వీర్రాజు కుమార్తె సూర్యకుమారి సైతం స్పందించారు. తన తండ్రికి, లోన్ వ్యవహారానికి ఎలాంటి సంబంధం లేదని.. ఇదంతా రాజకీయ కుట్ర అని చెప్పారు. తన తండ్రితో ఎలాంటి సంబంధాలు లేవన్నారు. పెళ్లి తర్వాత తన తండ్రి ఇప్పటివరకు తమ ఇంటికి రాలేదన్నారు. బిజినెస్ లావాదేవీల్లో భాగంగానే లోన్ తీసుకున్నామన్నారు.

ఉద్దేశపూర్వకంగా తమపై కేసు పెట్టారని.. పోలీసులు ఇంతవరకు తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని సూర్యకుమారి వివరించారు. తన తండ్రి ప్రతిష్టను దెబ్బతీయడానికే మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని సూర్యకుమారి ఆరోపించారు.