Amaravati: అభివృద్ధి ఆగిపోయినట్లు అనిపిస్తుంది.. త్వరగా తేల్చేస్తాం.. అమరావతిపై హైకోర్టు వ్యాఖ్యలు
ఏపీ హైకోర్టులో రాజధాని కేసుల రోజువారీ విచారణ ప్రారంభమైంది. అమరావతి కేసులపై ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు.

High Court Of Andhra Pradesh Key Comments On Amaravati
Amaravati: ఏపీ హైకోర్టులో రాజధాని కేసుల రోజువారీ విచారణ ప్రారంభమైంది. అమరావతి కేసులపై ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని కేసుల విచారణను త్వరగా చేపట్టి విచారణను ముగిస్తామని, రాష్ట్రంలో అభివృద్ధి కేసుల విచారణ వల్ల ఆగిపోయినట్లు కనిపిస్తుందని అభిప్రాయపడింది హైకోర్టు.
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ రైతుల తరుపున వాదనలు వినిపిస్తున్నారు. రాజధాని కేసుల విచారణకు ఎంతో ప్రాముఖ్యం ఉందని అన్నారు హైకోర్టు న్యాయమూర్తి. రాష్ట్రంలో అభివృద్ధి అంతా నిలిచిపోయినట్టే అనిపిస్తోందని, కక్షి దారులతో పాటు ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నట్టు అభిప్రాయపడ్డారు.
Kuppam: కుప్పంలో దొంగ ఓటర్లు.. టీడీపీ ఆందోళనలు.. పట్టుకున్న పోలీసులు
విచారణ నుంచి ఇద్దరు న్యాయమూర్తులు సత్యనారాయణమూర్తి, సోమయాజులును తప్పించాలన్న ప్రభుత్వం తరుపు న్యాయవాది కోరగా.. ప్రభుత్వ వాదనను తిరస్కరించింది ఏపీ హైకోర్టు. మూడు రాజధానులు, సీఆర్‌డీఏ రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై కూడా విచారణ జరుగుతోంది.
Nara Lokesh: పోలీసుల ముందే దొంగ ఓటర్లు కాలరెగరేసి వెళ్లి ఓటేస్తున్నారు