ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ఈసారి భారీగా పోలింగ్ నమోదు
స్వల్ప ఘటనల మినహా ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పుంగనూరు, పులివెందుల, మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు ఇప్పటికే ఏకగ్రీవం కాగా.. మిగిలిన 71 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లలో బుధవారం(మార్చి 10,2021) ఎన్నికలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2వేల 794 డివిజన్లు, వార్డు స్థానాల్లో 580 చోట్ల ఏకగ్రీవం కాగా మిగిలిన 2వేల 214 స్థానాల్లో పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.

high polling percentage in ap municipal elections: స్వల్ప ఘటనల మినహా ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పుంగనూరు, పులివెందుల, మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు ఇప్పటికే ఏకగ్రీవం కాగా.. మిగిలిన 71 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లలో బుధవారం(మార్చి 10,2021) ఎన్నికలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2వేల 794 డివిజన్లు, వార్డు స్థానాల్లో 580 చోట్ల ఏకగ్రీవం కాగా మిగిలిన 2వేల 214 స్థానాల్లో పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.
ఈనెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. కాగా, ఈసారి భారీగా పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. గతంలో పోలిస్తే ఓటింగ్ శాతం పెరిగే చాన్స్ ఉందని అంటున్నారు. దాదాపు 60శాతానికి పైగా పోలింగ్ శాతం నమోదైనట్టు సమాచారం. రాజకీయ పార్టీల గుర్తుల మీద జరిగిన ఈ ఎన్నికల్లో.. ఓటరు తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది. ఓటరు తీర్పు ఎటువైపోనని అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఈ నెల 14న వెలువడనున్నాయి. ఉదయం 8గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలుకానుంది. సాయంత్రంలోగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఫలితాలను ప్రకటిస్తారు. గెలుపుపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ధీమాగా ఉన్నాయి. అటు బీజేపీ-జనసేన కూటమి కూడా కాన్ఫిడెంట్ గా ఉంది. గుంటూరు, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లో చోటు చేసుకున్న చెదురుమదురు ఘటనలు మినహాయిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.