Honey Bees Attack : కోనసీమ జిల్లాలో కార్తీక వన భోజనాల్లో అపశ్రుతి.. తేనెటీగల దాడి, 25మందికి గాయాలు
కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెం గ్రామంలో కార్తీక వన భోజనాలు చేస్తున్న వారిపై తేనెటీగలు దాడి చేశాయి. కార్తీక మాసం సందర్భంగా గ్రామానికి చెందిన కొన్ని కుటుంబాలు కార్తీక వన భోజనం ఏర్పాటు చేసుకున్నారు.

Honey Bees Attack : కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెం గ్రామంలో కార్తీక వన భోజనాలు చేస్తున్న వారిపై తేనెటీగలు దాడి చేశాయి. కార్తీక మాసం సందర్భంగా గ్రామానికి చెందిన కొన్ని కుటుంబాలు కార్తీక వన భోజనం ఏర్పాటు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మహిళలు భారీగా పాల్గొన్నారు. అందరూ ఆటపాటలతో వన భోజనాలు చేస్తుండగా.. తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో 25మందికి గాయాలయ్యాయి. 10 మంది అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు మహిళలకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.