టీడీపీ జనసేన పొత్తు బలమైనదని ఇలా చాటిచెబుతున్న పవన్ కల్యాణ్

ఇప్పుడు పవన్ కల్యాణ్ అదే చేస్తున్నారని పొలిటికల్ సర్కిళ్లలో ప్రధానంగా వినిపిస్తున్న టాక్.

టీడీపీ జనసేన పొత్తు బలమైనదని ఇలా చాటిచెబుతున్న పవన్ కల్యాణ్

Updated On : March 31, 2025 / 8:27 PM IST

పార్టీల పొత్తుల్లో అప్పుడప్పుడు మనస్పర్థలు ఎగిసిపడుతుంటాయి. ఎంతమంచి అనుంబంధం ఉన్నా.. ఏదో ఒక సందర్భంలో విభేదాలు చిగురిస్తాయి. కింది స్థాయి నేతలయితే పొత్తులు నియమాలను లెక్కచేయకుండా గొడవలకు దిగుతారు. కొన్ని చినికి చినికి పెద్దు తుఫాన్‌గా మారిన ఘటనలు చరిత్రలో కోకొల్లలు.

కానీ టీడీపీ, జనసేన ఫ్రెండ్‌షిఫ్‌ అలా కాదు. ఎలాంటి గ్యాప్‌ లేకుండా సాఫీగా సాగుతోంది ఈ రెండు పార్టీల స్నేహం. కూటమిలో మూడు పార్టీలున్నా టీడీపీ, జనసేన సంబంధం వేరు. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ మధ్య ఎలాంటి రిలేషన్‌షిప్ ఉందో అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరూ ఒకరిని ఒకరు గౌరవించుకుంటారు.

ఒకరి గురించి ఒకరు తెలుసుకుని తగినట్లుగా వ్యవహరిస్తారు. రాజకీయాల్లో ఎంతో సీనియర్ మోస్ట్ లీడర్ అయినప్పటికీ చంద్రబాబు పవన్‌కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ విషయంలో ఎక్కడా రాజీపడరు. పవన్ సైతం బాబు సీనియారిటీని గౌరవిస్తారు. ఆయన నాయకత్వంలో పనిచేసే అవకాశం రావడం అదృష్టం అంటారు. చంద్రబాబు దగ్గర చాలా నేర్చుకుంటాను ప్రతిసారి చెబుతుంటారు.

Also Read: ఢిల్లీ పెద్దలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారా? తెలంగాణ బీజేపీ చీఫ్‌గా మరో 6 నెలలు కిషన్ రెడ్డి?

సీఎం చంద్రబాబు సీనియార్టీని, ఆయన సామర్థ్యాన్ని పవన్‌ కల్యాణ్ నిత్యం గుర్తుచేస్తూనే ఉంటారు. తమ మధ్య ఎలాంటి వైషమ్యాలు లేవని పదే పదే గుర్తుచూస్తేనే ఉంటారు. తాజాగా ఏపీలో పీ4 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేదికపై సీఎం చంద్రబాబు చేసిన అభివృద్ధిని ఆయన చేస్తున్న కృషిని డిప్యూటీ సీఎం పవన్ ప్రస్తావించారు.

పవన్ ఏమంటున్నారు?
చంద్రబాబు ముఖ్యమంత్రిగా లేకపోతే p4 కార్యక్రమం ఉండేది కాదన్నారు పవన్. అసలే ఈ రాష్ట్రం ఏమైపోయేదో అన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం స్వర్ణాంధ్ర అవుతుందని పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలా చంద్రబాబును పవన్‌ కల్యాణ్‌ గౌరవిస్తూ.. తమ పొత్తు బలమైనదని చాటిచెప్పే ప్రయత్నం చేస్తున్నారట. కూటమి నేతలకే కాదు. ప్రజలకు కూడా తెలిసేలా వేదికలపై చంద్రబాబు గొప్పతనాన్ని పవన్ కల్యాన్ చాటిచెబుతున్నారు.

టీడీపీ, జనసేన ఆవిర్భావ దినోత్సవాల వేళ కూడా ఇలాంటి సీన్సే కనిపించాయి. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా చంద్రబాబుపై పవన్‌ పొగడ్తల వర్షం కురిపించారు. చరిత్ర సృష్టించిన పార్టీగా అభివర్ణించారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేళ కూడా సీఎం చంద్రబాబు, లోకేశ్‌ రియాక్ట్ అయ్యారు. ఇలా రెండు పార్టీల మధ్య ఒక మంచి అనుబంధం ఉందని చెప్పడానికి అధినేత వ్యాఖ్యలు బలాన్ని ఇస్తున్నాయని పొలిటికల్ సర్కిళ్లలో చర్చ సాగుతుంది.

ఎంత మంచి అనుబంధం ఉన్నా పార్టీల పొత్తుల్లో చీలకలంటూ ఏదో ఒక సందర్భంలో గాసిప్స్‌ వినిపిస్తూనే ఉంటాయి. ఇటు వేరే పార్టీలు కూడా కొన్ని గాసిప్స్‌ మిక్స్ చేసి పొగ వేయడానికి ట్రై చేస్తుంటాయి. వీటన్నింటికి చెక్ పెట్టాలంటే.. పొత్తు పార్టీల బలాలను, ఆ పార్టీల అధినేతల గొప్పధనాన్ని ప్రస్తావిస్తూ ఉండాలి.

తమకు మీపై ఎలాంటి వైషమ్యాలు, వైరుధ్యాలు లేవంటూ పదే పదే రుజువు చేస్తూ ఉండాలి.. అప్పుడే ఆ పొత్తు చివరిదాకా కొనసాగుతుంది. ఇప్పుడు పవన్ కల్యాణ్ అదే చేస్తున్నారని పొలిటికల్ సర్కిళ్లలో ప్రధానంగా వినిపిస్తున్న టాక్. అందుకే పవన్ కల్యాణ్‌ ఇలా చంద్రబాబు పొలిటిక్ స్టామినాను గుర్తుచేస్తుంటారని గాసిప్‌ వినిపిస్తోంది. చంద్రబాబు కూడా అదే స్థాయిలో పవన్ కల్యాణ్‌ ప్రతిభను ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఇలా ఇద్దరి నేతల రిలేషన్‌షిప్‌తో టీడీపీ, జనసేన క్యాడర్‌ సైతం అదే స్నేహభావంతో ముందకు వెళ్తున్నాయి.