AP IAS Transfers : ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. పలువురు ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

AP IAS Transfers : ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ

Ap Ias Transfers

Updated On : June 5, 2021 / 6:30 AM IST

AP IAS Officers  Transfer : ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. పలువురు ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ను మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేసింది ప్రభుత్వం. అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు.

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ జె. నివాస్‌ కృష్ణా జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా ఎల్‌ఎస్ బాలాజీరావు బదిలీ కాగా.. చిత్తూరు జిల్లా హౌసింగ్‌ జేసీగా వెంకటేశ్వర్, అనంతపురం జిల్లా హౌసింగ్ జేసీగా నిశాంతి, అనంతపురం జిల్లా కలెక్టర్‌గా నాగలక్ష్మి, వైఎస్ఆర్ కడప జిల్లా హౌసింగ్‌ జేసీగా ధ్యానచంద్ర, విజయనగరం జిల్లా హౌసింగ్ జేసీగా మయూర్ అశోక్ బదిలీ అయ్యారు.

అలాగే పశ్చిమగోదావరి జిల్లా హౌసింగ్ జేసీగా సూరజ్ ధనుంజయ్, ఏపీ ఆగ్రోస్‌ ఎండీగా కృష్ణమూర్తి, విశాఖ జిల్లా హౌసింగ్ జేసీగా కల్పనకుమారి, శ్రీకాకుళం జిల్లా హౌసింగ్ జేసీగా హిమాన్షు కౌశిక్, కృష్ణా జిల్లా హౌసింగ్ జేసీగా అజయ్‌కుమార్, గుంటూరు జిల్లా హౌసింగ్‌ జేసీగా అనుపమ అంజలి, పాడేరు ఐటీడీఏ పీవోగా గోపాలకృష్ణ, తూర్పుగోదావరి జిల్లా జాయింట్ జేసీగా జాహ్నవి, కర్నూలు జిల్లా హౌసింగ్ జేసీగా మౌర్య, ప్రకాశం జిల్లా హౌసింగ్‌ జేసీగా కేఎస్ విశ్వనాథన్, నెల్లూరు జిల్లా హౌసింగ్‌ జేసీగా విధే ఖారే తదితరులు బదిలీ అయ్యారు.