ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు…అత్యధికంగా గుంటూరు జిల్లాలో 122

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు 525కి చేరాయి.

  • Published By: veegamteam ,Published On : April 16, 2020 / 07:41 AM IST
ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు…అత్యధికంగా గుంటూరు జిల్లాలో 122

Updated On : April 16, 2020 / 7:41 AM IST

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు 525కి చేరాయి.

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు 525కి చేరాయి. ఇప్పటి వరకు 14 మంది మృతి చెందారు. నిన్న ఒక్క రోజే 42 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఏపీలో ఇప్పటివరకు 14మంది కరోనాతో చనిపోయారు. 20 మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 122 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 110 కేసులు నమోదు అయ్యాయి. నెల్లూరు 58, కృష్ణా 45, ప్రకాశం 42, కడప 36, పశ్చిమ గోదావరి 31, చిత్తూరు 23, అనంతపురం 21, విశాఖ 20, తూర్పు గోదావరి జిల్లాలో 17 కేసుల చొప్పున రిజస్టర్ అయ్యాయి.

ఏపీలో మూడో విడత ఇంటింటి సర్వే పూర్తైంది. 32వేల మందికి త్వరలో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. గుంటూరులో వైద్య విద్యార్థికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కర్నూలులో వైద్యుడు మృతి చెందాడు. విజయవాడలో వృద్ధురాలి మృతితో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల పెరుగుదలపై ప్రజల్లో ఆందోళన చెందుతున్నారు. 

కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ డాక్టర్ (76) నిన్న(ఏప్రిల్ 15,2020) మృతి చెందాడు. వైద్యుడికి కరోనా వైరస్‌ ఉన్నట్లు చనిపోయిన తరువాత పరీక్షల్లో నిర్ధారణ అయింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. డాక్టర్ కు కరోనా ఉందని తేలడం రోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంద. రెండు జిల్లాల ప్రజలను భయాందోళనకు గురి చేసింది. చాలా మంది రోగులు ఆ వైద్యుడి దగ్గర చికిత్స చేయించుకున్నారు. 

వైద్యుడి దగ్గరికి తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి మహబూబ్‌నగర్‌, కర్నూలు జిల్లాల నుంచి రోగులు వెళ్లారు. ఇప్పుడా డాక్టర్ కి కరోనా అని తెలియడంతో ఆయన దగ్గర చికిత్స పొందిన రోగుల్లో ఆందోళన నెలకొంది. డాక్టర్ మృతితో అధికారులు అలర్ట్ అయ్యారు. వైద్యుడిని ఎవరెవరు సంప్రదించారో అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వారి వివరాలు సేకరిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణ, ఏపీలో రోజూ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 650 మంది కరోనా బారినపడ్డారు. యాక్టివ్ కేసులు 514. ఇప్పటివరకు కరోనాతో 18మంది చనిపోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 118మంది కరోనా నుంచి కోలుకున్నారు. 
 

Also Read | యూపీలో డాక్టర్లు,హెల్త్ సిబ్బందిపై రాళ్ల దాడి…17మంది అరెస్ట్