జగన్ నామినేషన్: పులివెందులలో సందడి

  • Published By: vamsi ,Published On : March 22, 2019 / 02:27 AM IST
జగన్ నామినేషన్: పులివెందులలో సందడి

Updated On : March 22, 2019 / 2:27 AM IST

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పులివెందులలో నేడు(22మార్చి 2019) నామినేషన్ వేయనున్నారు. ఎన్నికల నామినేషన్ వేయడానికి ఇక మూడు రోజుల గడువే ఉండడంతో ఇవాళ ఆయన నామినేషన్ వేస్తున్నారు. ఉదయం పులివెందులకు 9గంటల సమయంలో చేరుకుని, అనంతరం భారీ బహిరంగసభలో ఆయన పాల్గొంటారు.
Read Also : చావుతో ఆటలు : PubG ఆడుతూ నరాలు పట్టేసి.. చనిపోయాడు

అనంతరం  పులివెందులలో మధ్యాహ్నం 1.40 నుంచి 1.49 నిమిషాల మధ్యలో జగన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. జగన్ నామినేషన్ నేపథ్యంలో పులివెందులలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు ర్యాలీలు చేస్తూ సందడి చేస్తున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వేలాదిగా కార్యకర్తలు తరలివస్తున్నారు.