Pawan Kalyan: పార్టీ ముఖ్య నేతలతో పవన్ కల్యాణ్ కీలక భేటీ.. ఈ అంశాలపై జనసేనాని ఫోకస్..
ఏపీ అసెంబ్లీలో బోండా ఉమ, నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు, వీటి కారణంగా పార్టీలో వచ్చిన డిస్టర్బెన్స్ తదితర అంశాలపై..

Pawan Kalyan: మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో జనసేనాని పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్టీ విస్తరణ, బలోపేతంపై పవన్ కల్యాణ్ దృష్టి సారించారు. త్రిశూల్ వ్యూహంతో 3 అంచెలుగా పార్టీని బలోపేతం చేయాలని పవన్ నిర్ణయించారు. కార్యకర్తలు, నాయకత్వం, భద్రత-బాధ్యత అంశాలపై పార్టీ నేతలతో చర్చిస్తున్నారు పవన్ కల్యాణ్.
ఏపీ అసెంబ్లీలో బోండా ఉమ, నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు, వీటి కారణంగా పార్టీలో వచ్చిన డిస్టర్బెన్స్ తదితర అంశాలపై పార్టీ నాయకులతో పవన్ మాట్లాడుతున్నారని తెలుస్తోంది. అటు చంద్రబాబుతో, ఇటు లోకేశ్ తో పవన్ కు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. అయితే, ఇటీవల కొందరు నాయకులు చేసిన వ్యాఖ్యల వల్ల కేడర్ లో కొంత అసంతృప్తి వ్యక్తమైంది. ఈ వ్యవహారంలో ఏ విధంగా ముందుకెళ్లాలి అనేదానిపై పవన్ చర్చిస్తున్నట్లు సమాచారం.
భవిష్యత్తులోనూ కలిసి పోటీ చేయాలి, ఇదే వ్యూహంతో ముందుకెళ్లాలి, ఐక్యమత్యంగా ముందుకెళ్లడం ద్వారా జగన్ ను ఎదుర్కోవడం.. ఈ అంశాలన్నింటిపై పవన్ డిస్కస్ చేస్తున్నారట. పార్టీని బలోపేతం చేయడం, ఈ మధ్యకాలంలో తలెత్తిన డిస్టర్బెన్స్ లను క్లియర్ చేయడం, కూటమితో కలిసి ముందుకెళ్లడం తదితర అంశాలపై పార్టీ ముఖ్య నాయకులతో పవన్ కల్యాణ్ ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం.
Also Read: ఎమ్మెల్యేల తీరు అస్సలు బాలేదన్న సీఎం చంద్రబాబు.. ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో..