తిరుపతికి పవన్ కళ్యాణ్.. ఉపఎన్నిక సీటుపై క్లారిటీ వస్తుందా?

తిరుపతికి పవన్ కళ్యాణ్.. ఉపఎన్నిక సీటుపై క్లారిటీ వస్తుందా?

Updated On : January 15, 2021 / 2:48 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి ఉపఎన్నికల హడావుడి అప్పుడే కనిపిస్తోంది. ఇప్పటికే రెండు ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలు అభ్యర్థులను ప్రకటించగా.. బీజేపీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనవరి 21వ తేదీన తిరుపతిలో పర్యటించబోతున్నారు. ఈ మేరకు పార్టీ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. 21న సాయంత్రం తిరుపతి నగరంలో నిర్వహించనున్న జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(PAC)లో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు.

పవన్‌ కళ్యాణ్‌తో పాటు రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొంటారు. ఈ సమావేశంలో ముఖ్యమైన అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తుంది. తిరుపతి ఉపఎన్నికలో అభ్యర్థి విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.