JC Prabhakar Reddy: ఈ ఎమ్మెల్యేలు మరోసారి గెలిచే అవకాశం లేదు: జేసీ ప్రభాకర్‌ రెడ్డి

ఎమ్మెల్యేలు అందరూ సీట్ల గొడవలో ఉన్నారని, సీఎం జగన్ సీట్ల మార్పులో బిజీగా ఉన్నారని..

JC Prabhakar Reddy: ఈ ఎమ్మెల్యేలు మరోసారి గెలిచే అవకాశం లేదు: జేసీ ప్రభాకర్‌ రెడ్డి

JC Prabhakar Reddy

Updated On : December 30, 2023 / 5:59 PM IST

ఎమ్మెల్యేలు ఎవరూ పత్తి రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లాలోని లక్షుం పల్లిలో ఇవాళ ఆయన పత్తి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.

ప్రస్తుత ఎమ్మెల్యే లు మరోసారి గెలిచే అవకాశం లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. వారు ఎన్నడూ రైతుల సమస్యలను పట్టించుకోలేదని, మరి ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. సీట్లను మార్చినంత మాత్రాన ‘ఇక్కడి చెత్త… మరో చోట బంగారం అవుతుందా?’ అని నిలదీశారు. కల్యాణ దుర్గంలో గెలవని ఎమ్మెల్యేని పెనుకొండకు మార్చితే గెలుస్తారా? అని అన్నారు.

రాష్ట్రంలో రైతులు బలవన్మరణాలకు పాల్పడే దుస్థితికి తీసుకొచ్చారని అన్నారు. పాత కాటన్ కొనుగోళ్లు లేవని, సీసీఐ నుంచి స్పందన లేదని చెప్పారు. గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని, అసలు ఎమ్మెల్యేలు అందరూ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారని నిలదీశారు. రైతుల సమస్యలను పట్టించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఎమ్మెల్యేలు అందరూ సీట్ల గొడవలో ఉన్నారని, పల్లెల్లో రైతులు గోడు చూడాలని కోరారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. సీఎం జగన్ సీట్ల మార్పులో బిజీగా ఉన్నారని, రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు.

Kottu Satyanarayana: ఈ స్కాముల్లో పవన్ కల్యాణ్‌కు కూడా వాటా?: కొట్టు సత్యనారాయణ