JC Prabhakar Reddy: నీ ఇల్లు కూలుస్తా, భూముల ఫెన్సింగ్ పీకేస్తా- మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి నా ఇంట్లోకి వచ్చాడు. నీ శత్రువు నీ ఇంటికి వస్తే నీకు ఎలా ఉంటుంది..

JC Prabhakar Reddy: నీ ఇల్లు కూలుస్తా, భూముల ఫెన్సింగ్ పీకేస్తా- మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్

Updated On : May 3, 2025 / 8:06 PM IST

JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి టార్గెట్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. తాడిపత్రికి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి హైకోర్టు ఆర్డర్ వచ్చినా జేపీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకుంటున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ మండిపడ్డారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ రెడ్డి వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు జేసీ ప్రభాకర్ రెడ్డి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి నా ఇంట్లోకి వచ్చాడు.. నీ శత్రువు నీ ఇంటికి వస్తే నీకు ఎలా ఉంటుంది అని రాంభూపాల్ ను నిలదీశారు జేసీ ప్రభాకర్ రెడ్డి.

అధికారంలో ఉన్నప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన ఆగడాలకు అడ్డే లేదు. పుట్లూరు మండలం కోమటికుంటలో సోలార్ భూములను పెద్దారెడ్డి బలవంతంగా రైతుల దగ్గర నుండి లాక్కున్నప్పుడు నీకు కనపడలేదా? నా అనుచరుడు పొట్టి రవికి హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా, పోలీసుల అండతో పెద్దారెడ్డి పొట్టి రవిని 5 సంవత్సరాలు తాడిపత్రిలోకి రానివ్వలేదు.

Also Read: అది నిరూపిస్తే ఇప్పుడే రాజీనామా చేస్తా- వైసీపీకి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సవాల్

తాడిపత్రిలో మహిళా కౌన్సిలర్లపైనా మర్డర్ కేసులు బనాయించి జైలుకి పంపించిన ఘనత పెద్దారెడ్డిది. తాడిపత్రిలో వైసీపీ ప్రభుత్వంలో పెద్దారెడ్డి పోలీసుల సాయంతో టీడీపీ కార్యకర్తలపై పీడీ యాక్ట్, రౌడీషీట్లు నమోదు చేశాడు. పెద్దారెడ్డి రైతుల నుంచి ఆక్రమించుకున్న భూములు ఫెన్సింగ్ పీకేస్తా. మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి పెద్దారెడ్డి అక్రమంగా నిర్మించిన ఇల్లు కూలుస్తా. నా బస్సులు ఐదు సంవత్సరాలు అన్యాయంగా ఆపినా ఒక్క నాయకుడు కూడా మాట్లాడలేదు. గతంలో పెద్దారెడ్డి ఏ ప్రభుత్వం వచ్చినా ఫ్యాక్షన్ చేస్తా అన్నాడు. ఇప్పుడు తాడిపత్రికి రావాలి, ఫ్యాక్షన్ చేయాలి” అని జేసీ ప్రభాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు.