బాలయ్య అల్లుడికి షాక్..ఆస్తుల జప్తునకు బ్యాంకు నోటీసులు

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అల్లుడు శ్రీ భరత్‌కు షాక్ తగిలింది. ఈయన గీతం సంస్థల అధినేత అనే సంగతి తెలిసిందే. రూ. 124.39 కోట్లు చెల్లించాలని కరూర్ వైశ్య బ్యాంకు నోటీసులు అందచేసింది. హైదరాబాద్ ఆబిడ్స్ బ్రాంచ్‌లో గాజువాక, భీమిలిలోని భూములు తాకట్టు పెట్టి శ్రీ భరత్ రుణం తీసుకున్నారు. ఆస్తుల జప్తునకు కరూర్ వైశ్య బ్యాంకు నోటీసులు జారీ చేసింది.
కొన్ని రోజులుగా..ఐటీ అధికారులు ఏపీ రాష్ట్రంలో దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా టీడీపీ నేతల ఇళ్లపై సోదాలు, తనిఖీలు చేస్తుండడం కలకలం రేపుతోంది.
చంద్రబాబు మాజీ పీఎస్ పి.శ్రీనివాస్ ఇంటిపై ఏకకాలంలో సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని భారీగా అక్రమాస్తులు కూడబెట్టారని శ్రీనివాసరావుపై ఆరోపణలున్నాయి. దీంతో 9 మంది అధికారులు రెండు రోజులుగా సోదాలు చేస్తున్నారు.
* పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌కు చెందిన కంపెనీలో ఐటీ సోదాలు.
* కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి 30 గంటల పాటు ఐటీ సోదాలు.
* ఇటీవలే టీడీపీ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డికి చెందిన జేసీ ట్రావెల్స్ లో కూడా సోదాలు జరిగాయి.