Cm Chandrababu : సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు..

బియ్యం అక్రమ రవాణను అడ్డుకునే అంశంపై కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది.

Cm Chandrababu : సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు..

Updated On : December 2, 2024 / 11:23 PM IST

Cm Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో వీరి భేటీ జరిగింది. దాదాపు 2 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో పవన్ డిస్కస్ చేశారు. కాకినాడ పోర్టు రేషన్ బియ్యం స్మగ్లింగ్ కు అడ్డాగా మారిందని, బియ్యం స్మగ్లింగ్ ను అడ్డుకునేందుకు చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబును కోరారు. బియ్యం అక్రమ రవాణ దందాకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద నెట్ వర్క్ పని చేస్తోందని పవన్ వివరించారు. పోర్టు పర్యటనలో తనను అడ్డుకున్న అంశంపైనా పవన్ చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది.

బియ్యం రవాణను అడ్డుకునేందుకు త్వరలోనే ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కేబినెట్ భేటీలో కూడా ఈ అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. అటు తాజా రాజకీయ పరిణామాలు, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై కూడా సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తన ఢిల్లీ పర్యటన విశేషాలను సైతం చంద్రబాబుకు వివరించారు పవన్ కల్యాణ్.

సోషల్ మీడియా కేసులు, నామినేటెడ్ పదవుల అంశంపైనా ఇరువురూ డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది. అటు నామినేటెడ్ పదవులకు సంబంధించి త్వరలోనే మరో జాబితా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం కూటమి నేతలు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు రాజధానిలో అభివృద్ది పనులపై ఇరువురు నేతలు చర్చించారు. అమరావతి అభివృద్ది పనులను వేగవంతం చేయాలని నిర్ణయించారు.

 

Also Read : బాబు, పవన్ భేటీ.. రేషన్ రైస్‌ మాఫియాకు హడల్‌.. బియ్యం దందా వెనుక ఉన్న ఆ పెద్దల అంతు చూస్తారా?