Kinjarapu Atchannaidu : మిమ్మల్ని వదలం.. కొల్లు రవీంద్ర పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై అచ్చెన్నాయుడు ఫైర్
టీడీపీ నేతలంటే జగన్ రెడ్డికి ఎందుకంత భయం? చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే పోలీసులను కోర్టు బోనులో నిలబెడతామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. Kinjarapu Atchannaidu

Kinjarapu Atchannaidu Fires On Police (Photo : Facebook Google)
Kinjarapu Atchannaidu Fires On Police : పోలీసుల తీరుపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. టీడీపీ నేత, మాజీమంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకోవడం దుర్మార్గం అన్నారు. ఉదయం 6 గంటల నుంచి ఇప్పటివరకు తిప్పుతూ ఇంతవరకు ఎక్కడున్నారో కనీసం కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వరా? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఎవరికీ చెప్పకుండా కొల్లు రవీంద్రను రహస్య ప్రాంతాల్లో తిప్పాల్సిన అవసరం ఏంటి? అని నిలదీశారు. అసలు కొల్లు రవీంద్ర చేసిన తప్పేంటి? అని అడిగారు అచ్చెన్నాయుడు.
”నోటీసులు ఇవ్వకుండా పోలీసులు ఏ విధంగా అదుపులోకి తీసుకుంటారు? టీడీపీ నేతలంటే జగన్ రెడ్డికి ఎందుకంత భయం? కొల్లు రవీంద్రను పోలీసులు వెంటనే విడుదల చేయాలి. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే పోలీసులను కోర్టు బోనులో నిలబెడతాము” అని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
Also Read : త్వరలోనే విశాఖకు షిప్ట్ అవుతున్నా.. ఇక్కడి నుంచే పాలన కొనసాగిస్తాం
మరోవైపు మాజీమంత్రి కొల్లు రవీంద్రని మచిలీపట్నంలోని ఆయన ఇంటి దగ్గర దింపేశారు పోలీసులు. పోలీసులు తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని, వారిపై ప్రైవేట్ కేసు వేస్తానని కొల్లు రవీంద్ర అన్నారు.