Love Marriage: ప్రేమ పెళ్లితో ఊరిలో గొడవ.. పోలీసులపై కారంపొడి చల్లి..

Love Marriage: ప్రేమ పెళ్లితో ఊరిలో గొడవ.. పోలీసులపై కారంపొడి చల్లి..

Love Marriage In Kurnool District Cause For Quarrel

Updated On : May 25, 2021 / 7:31 AM IST

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామంలో ఓ వర్గం వారు మరో వర్గం వారి కాలనీపై దాడి చేసి ఇళ్లు ధ్వంసం చేశారు. గ్రామానికి చెందిన ఓ ప్రేమజంట పెళ్లి చేసుకోవడమే ఘర్షణకు కారణమైంది. పగిడిరాయి గ్రామానికి చెందిన యువతీ, యువకుడు కొన్నాళ్లుగా ప్రేమించుకున్నారు.

పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. దీంతో కోపోద్రిక్తులైన యువతి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు యువకుడి కుటుంబంపై దాడికి పాల్పడ్డారు.

యువకుడి సామాజిక వర్గానికి చెందిన ఆరు ఇళ్లపై దాడి చేశారు యువతి బంధువులు. ఇంట్లోని సామాగ్రినంతా బూడిద చేసి.. నాలుగు ఆటోలకు నిప్పంటించడంతో పూర్తిగా దగ్దమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు.

అమ్మాయి తరపు బంధువులను నిలువరించే ప్రయత్నం చేయగా… ఏకంగా పోలీసులపైనే దాడికి యత్నించారు. ఎస్సైపై కారంపొడి చల్లి దాడికి యత్నించారు.

దీంతో రాత్రంగా గ్రామంలో ఉద్రిక్తత కొనసాగుతుండడంతో పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు యువకుడి కుటుంబ సభ్యులు ఇల్లు వదిలి పారిపోయారు.