Magunta Sreenivasulu Reddy: ఇంతకాలం మాకు అండగా నిలిచిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు

ఇంతకాలం మాకు అండగా నిలిచిన సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు అంటూ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు.

Magunta Sreenivasulu Reddy: ఇంతకాలం మాకు అండగా నిలిచిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు

magunta sreenivasulu reddy

Sreenivasulu Reddy : ”మా కుటుంబం గత 33 సంవత్సరాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్నాం. ఈ ముప్పైమూడేళ్లలో మాకు రాజకీయ జీవితం ఇచ్చింది ఒంగోలు, మాకు దేశవ్యాప్తంగా నివాసాలు ఎక్కడ ఉన్నా.. తమ ప్రయాణ జీవితం మాత్రం ఒంగోలులోనే” అని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 33 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎనిమిది సార్లు పార్లమెంట్, రెండు సార్లు అసెంబ్లీ, ఒకసారి ఎమ్మెల్సీగా పోటీ చేశానని చెప్పారు. మాగుంట కుటుంబం అంటే ఆత్మగౌరవం కోసమే బతుకుతుందని, ఇగో అహకారం ఉండదని అన్నారు.

Also Read : గుంటూరు పశ్చిమ టీడీపీ అభ్యర్థి ఎవరు? ఎటూ తేల్చుకోలేకపోతున్న చంద్రబాబు..!

తమ కుటుంబం నుంచి రానున్న ఎన్నికల్లో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి బరిలో నిలవబోతున్నారని శ్రీనివాసులు చెప్పారు. అనివార్య పరిస్థితుల్లో తాము వైసీపీకి రాజీనామా చేస్తున్నామని, ఇంతకాలం తమకు అండగా నిలిచిన సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు అంటూ శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. వైసీపీని వీడటం బాధాకరమైన విషయం అన్నారు. త్వరలో తన రాజకీయ కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు.