Maharashtra CM Eknath Shinde : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే

ప్రముఖులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి ఆశీస్సులు పొందారు.

Maharashtra CM Eknath Shinde : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే

maha cm

Updated On : January 2, 2023 / 8:42 AM IST

Maharashtra CM Eknath Shinde : తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి శోభ సంతరించుకుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ దర్శనం ద్వారాలు తెరుచుకున్నాయి. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ప్రముఖులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి ఆశీస్సులు పొందారు.

ఏపీ మంత్రులు అంబటి రాంబాబు, అమర్ నాథ్, విశ్వరూప్, పెద్దిరెడ్డి, జయరాం, కారుమూరి, ఉపశ్రీ, టీసీఎస్ చైర్మన్ నటరాజన్, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ మిథున్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ వీరభద్రస్వామి, మాజీ మంత్రి వెలంపల్లి, ఆర్.కృష్ణయ్య, వైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రబాబు, కె.లక్ష్మణ్, సినీ నటుడు రాజేంద్రప్రసాద్, తెలంగాణ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమాలకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు శ్రీవారిని దర్శించుకున్నారు.

Srivari Vaikuntha Darshan : తిరుమల శ్రీవారి ఆలయంలో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు.. భారీగా తరలివస్తున్న భక్తులు

తిరుమల శ్రీవారి ఆలయంలో అర్చకులు ధనుర్మాస ప్రత్యేక పూజా, కైంకర్యాలు, నివేదనలు చేశారు. వైకుంఠ ద్వారం ద్వారా తిరుమల శ్రీవారి దర్శనానికి భక్త జనం పోటెత్తారు. శ్రీవారికి నిర్వహించే కైంకర్యాలు పూర్తి చేశాక అర్ధరాత్రి 12.5 గంటలకు దర్శనాలు ప్రారంభించారు. ముందుగా టీటీడీ పాలక మండలి, అధికారులు వైకుంఠ ద్వారా ప్రదక్షిణ చేశారు. అనంతరం ప్రముఖులు వైకుంఠ ద్వారా దర్శనం చేశారు. అత్యంత ప్రముఖులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ధర్మకర్తల మండలి సభ్యులు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.