ముగ్గురు పిల్లలతో సహా వివాహిత ఆదృశ్యం

married woman missing : తిరుపతి కి చెందిన వివాహిత మహిళ శ్రీలేఖ తన ముగ్గురు పిల్లలతో సహా ఆదృశ్యం అయ్యింది. కెన్నడీ నగర్ కు చెందిన శ్రీలేఖ అనే మహిళ నిన్న మధ్యాహ్నం తన ముగ్గరు పిల్లలు దీక్షతశ్రీ, తేజశ్రీ, కార్తీక్ లను తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లింది.
సాయంత్రం అయినా ఇంటికి తిరిగి రాకపోవటంతో భర్త శివకుమార్ తిరుపతి తూర్పు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
శ్రీలేఖ తన పిల్లలతో రిలయన్స్ మార్ట్ సమీపంలో వెళుతుండగా ఉన్న సీసీటీవీ దృశ్యాలను పోలీసులు గుర్తించారు. శ్రీలేఖ, పిల్లల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.