AP Rain Alert: ఏపీకి రెయిన్ అలర్ట్.. రెండ్రోజులు పిడుగులతో కూడిన వర్షాలు.. ఏఏ జిల్లాల్లో అంటే..
ఏపీకి వర్షం ముప్పు పొంచిఉంది. ఇవాళ, రేపు ఏపీలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ..

AP Rain
AP Rain Alert: ఏపీకి వర్షం ముప్పు పొంచిఉంది. ఇవాళ, రేపు ఏపీలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడటం వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
Also Read: ఆఫ్ట్రాల్ ఎమ్మెల్యేవి.. నీకెందుకు అంత సెక్యూరిటీ! … వైఎస్ జగన్‌పై రెచ్చిపోయిన పరిటాల సునీత
మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా బలపడి నైరుతి, దానికి ఆనుకుని దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించి స్థిరంగా కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో ఉత్తర ఈశాన్యంగా దిశ మార్చుకొని బలహీన పడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఫలితంగా రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ పేర్కొంది. గురువారం ఉత్తర కోస్తాలో పలు చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు విశాఖపట్టణంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో కోస్తాంధ్రకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
Also Read: Ys Jagan : ఏపీలో బీహార్ కన్నా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి- కూటమి ప్రభుత్వంపై జగన్ ఫైర్
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఇవాళ, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఏప్రిల్ 11వ తేదీన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, పిడుగులు, పడే అవకాశం ఉన్నందున ప్రజలు చెట్ల కింద నిలబడవద్దని సూచించారు.
మరోవైపు బుధవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని 28 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏలూరులో ఐదు మండలాలు, ఎన్టీఆర్ జిల్లాలో రెండు, గుంటూరులో తొమ్మిది, పల్నాడులో రెండు మండలాల్లో తీవ్ర వడగాలులు ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.