Kodali Nani : చంద్రబాబు డైరెక్షన్‌లోనే రంగా హత్య, వర్మ మాటలు పట్టించుకోము- కొడాలి నాని
చంద్రబాబు రంగాని పొట్టన పెట్టుకున్న వ్యక్తి. మళ్లీ వాళ్ల ఇంటికి వెళ్లాడు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే రంగా హత్య జరిగింది.

Kodali Nani
Kodali Nani : మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా హత్యకు రెక్కీ అంశంపై మంత్రి కొడాలి నాని హాట్ కామెంట్స్ చేశారు. తన హత్యకు రెక్కీ జరిగిందని నా సమక్షంలో రాధా అన్నారని, అందుకే నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ వెంటనే స్పందించి రాధాకు సెక్యూరిటీ ఇప్పించారని, విచారణకు కూడా ఆదేశించారని కొడాలి నాని చెప్పారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు దీన్ని రాజకీయంగా లబ్ది పొందాలని చూశారని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారని ఆరోపించారు.
Pani Puri : స్ట్రీట్ ఫుడ్ పానీ పూరీ ఆరోగ్యానికి మంచిదేనా?
‘నా పార్టీ వేరు రాధా పార్టీ వేరు.. కానీ అతనికి హాని ఉంటే కాపాడాలని అనుకుంటాం. చంద్రబాబు రంగాని పొట్టన పెట్టుకున్న వ్యక్తి. మళ్లీ వాళ్ల ఇంటికి వెళ్లాడు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే రంగా హత్య జరిగింది. ఈ వ్యవహారంలో నాపై విమర్శలు వచ్చాయని నేను అనుకోను. రాజకీయాల్లో విమర్శలు
సహజం. చంద్రబాబు ఎయిడ్స్ లాంటి వాడు. రాజకీయ వ్యభిచారం చెయ్యడం అలవాటు’ అని కొడాలి నాని ఫైర్ అయ్యారు.
Dangerous Alexa: 10 ఏళ్ల చిన్నారిని కరెంటు ప్లగ్‌లో వేలు పెట్టమన్న “అలెక్సా”
ఏపీలో సినిమా టికెట్ల ధరలపై డైరెక్టర్ రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపైనా మంత్రి కొడాలి నాని స్పందించారు. ఆర్జీవీపై ఆయన ధ్వజమెత్తారు. పక్క రాష్ట్రంలో ఉండి వర్మ ఏమైనా మాట్లాడతాడు. పక్క రాష్ట్రంలో, ఇతర దేశాల్లో ఉండే వాళ్లని మేము పట్టించుకోము. సినిమా టికెట్లపై మా వైఖరి ఒక్కటే అని మంత్రి కొడాలి నాని తేల్చి చెప్పారు.
ఈ నెల 26న గుడివాడలో వంగవీటి రంగా 33వ వర్ధంతి సభలో పాల్గొన్న వంగవీటి రాధా.. తన హత్యకు కొందరు కుట్ర పన్నారని, రెక్కీ కూడా నిర్వహించారని సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ సమక్షంలో రాధా చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో కలకలం రేపాయి. వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం వంగవీటి రాధాకు భద్రత కల్పించింది. ఇందులో భాగంగా 2+2 గన్‌మెన్లను కేటాయించింది. అయితే గన్ మెన్లను వంగవీటి రాధా తిరస్కరించారు. అభిమానులే తనకు రక్షణ అని చెప్పారు.
రాధా రెక్కీ అంశంపై విజయవాడ సీపీ కాంతి రానా టాటా స్పందించారు. రాధా హత్యకు రెక్కీ జరిగినట్టు ఎలాంటి ప్రాధమిక ఆధారం లేదన్నారు. రాధాకు భద్రత కల్పిస్తామన్నారు. దీనిపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందన్నారు. ఈ ఘటనపై ఎలాంటి అవాస్తవాలు ప్రసారం చేయొద్దని సీపీ కోరారు.