Nara Lokesh: అసెంబ్లీ లాబీలో మార్షల్స్ అతి ప్రవర్తనపై మంత్రి నారా లోకేశ్‌ ఫైర్.. “ఈ వ్యవహారాల్లో జోక్యం వద్దు” అంటూ..

"సభ్యుల వ్యవహారాల్లో మీకేం పని" అంటూ మార్షల్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా తాడేపల్లి ప్యాలెస్ పాలనలో ఉన్నామనుకుంటున్నారా అంటూ చురకలు అంటించారు.

Nara Lokesh: అసెంబ్లీ లాబీలో మార్షల్స్ అతి ప్రవర్తనపై మంత్రి నారా లోకేశ్‌ ఫైర్.. “ఈ వ్యవహారాల్లో జోక్యం వద్దు” అంటూ..

Nara Lokesh

Updated On : September 18, 2025 / 2:51 PM IST

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ లాబీలో మార్షల్స్ అతి ప్రవర్తనపై మంత్రి నారా లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన చాంబర్ నుంచి నారా లోకేశ్ బయటకు వస్తున్న సమయంలో లాబీలో ఉన్న ఇతరులను తప్పుకోండి అంటూ మార్షల్స్ హడావుడి చేశారు.

దీంతో నారా లోకేశ్ కల్పించుకుని “సభ్యుల వ్యవహారాల్లో మీకేం పని” అంటూ మార్షల్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా తాడేపల్లి ప్యాలెస్ పాలనలో ఉన్నామనుకుంటున్నారా అంటూ చురకలు అంటించారు. “బయటి వ్యక్తులులోపలికి రాకుండా చూసుకోవాలి.. కానీ, ఎమ్మెల్యేల వ్యవహారంలో జోక్యం వద్దు” అని హితవు పలికారు. (Nara Lokesh)

కాగా, ఇవాళ ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. రాష్ట్రంలోని సమస్యలపై సభ్యులు ప్రశ్నలు అడిగారు. పింఛన్లు, యూరియా సమస్య, ఏపీ మద్యం పాలసీ వంటి అంశాలపై చర్చించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరు ఆర్డినెన్స్‌ల స్థానంలో బిల్లులను ప్రవేశపెట్టాల్సి ఉంది. వాటిలో మునిసిపల్‌ చట్టాల సవరణ, పంచాయతీరాజ్‌ సవరణ, ఏపీ మోటారు వాహనాల పన్నులు కూడా ఉన్నాయి.

Also Read: రాహుల్ గాంధీ మరో బాంబు.. మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’.. ఈసారి సీఈసీపై డైరెక్ట్ ఎటాక్..