Amaravati : ప్రజలపై ఒక్క పైసా భారం పడకుండా రాజధాని నిర్మాణం, అప్పులు అలా తీరుస్తాం- మంత్రి నారాయణ
ఏప్రిల్ ప్రధాని మోదీ ఈ నిర్మాణ పనులను ప్రారంభిస్తారని మంత్రి నారాయణ చెప్పారు.

Amaravati : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై ఫోకస్ పెట్టారు మంత్రి నారాయణ. ఇవాళ ఆయన అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న ఐఏఎస్ బంగ్లాలను పరిశీలించారు. అధికారుల కోసం 115 భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. సెక్రటరీలకు 90 భవనాలు, ప్రిన్సిపల్ సెక్రటరీలకు 25 భవనాలు నిర్మిస్తున్నారు. వచ్చే నెల నుంచి అమరావతి నిర్మాణ పనులను పున: ప్రారంభిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఏప్రిల్ ప్రధాని మోదీ ఈ నిర్మాణ పనులను ప్రారంభిస్తారని మంత్రి నారాయణ చెప్పారు.
అమరావతి నిర్మాణానికి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసామన్నారు మంత్రి నారాయణ. రానున్న మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నామన్నారు. రాజధాని నిర్మాణం కోసం 31వేల కోట్ల రూపాయల రుణం తీసుకున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు.
Also Read : తల్లికి వందనం పథకంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. వాళ్లకు స్కీం పక్కా..
కాగా అమరావతి నిర్మాణానికి ప్రజల సొమ్ము ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయము అని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు ప్రజలపై ఒక్క పైసా భారం పడకుండా రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేశాక భూమి అమ్మి అప్పులు తీరుస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు.
”అమరావతి రాజధాని సిటీలో అన్ని పనులకు 90శాతం వరకు టెండర్లు అయిపోయాయి. కాంట్రాక్టర్లు కూడా మ్యాన్ పవర్ ను మొబలైజ్ చేసుకుంటున్నారు. వచ్చిన లేబర్ కి క్యాంపులు ఏర్పాటు చేసుకోవడం, దానికి సంబంధించిన మెస్ లు అరేంజ్ చేసుకుంటున్నారు. దాంతో పాటే అన్నింటికంటే ముఖ్యమైనది ఎంక్విప్ మెంట్, మెషినరీ. వాటిని కూడా మొబలైజ్ చేస్తున్నారు. మరో 15 రోజుల్లో మిషనరీ, క్యాంపులు అంతా సెటప్ అయ్యి పనులు పూర్తి స్థాయిలో జరిగే అవకాశం ఉంది.
Also Read : నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు.. మరో పదిరోజుల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్
ఇప్పటివరకు వరల్డ్ బ్యాంక్, ఏడీబీ ద్వారా 15వేల కోట్లు.. హడ్కో ద్వారా 11వేల కోట్లు, బ్యాంకు ద్వారా ఇంకో 5వేల కోట్లు మొబలైజేషన్ చేశాం. వాళ్లు కూడా త్వరలో రిలీజ్ చేస్తారు. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. మొత్తం ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే మరిన్ని నిధులు కావాల్సి ఉంది. తొలుత ఈ నిధులతో పనులు ప్రారంభిస్తాం. తర్వాత ల్యాండ్ బ్యాంక్ ద్వారా మొబలైజ్ చేసి ముందుకెళ్తాం.
ప్రధాని మోదీ ఇన్ ప్రిన్సిపల్ రావడానికి యాక్సెప్ట్ చేశారు. డేట్ ఇంకా క్లియర్ కాలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడి డేట్ క్లియర్ చేస్తారు. బహుశా ఏప్రిల్ మిడిల్ లో ప్రధాని రావొచ్చు” అని మంత్రి నారాయణ తెలిపారు.