చంద్రబాబును తిరగనివ్వం.. ఆయనకు వచ్చిన నష్టం ఏంటీ?

  • Published By: vamsi ,Published On : January 10, 2020 / 04:51 AM IST
చంద్రబాబును తిరగనివ్వం.. ఆయనకు వచ్చిన నష్టం ఏంటీ?

Updated On : January 10, 2020 / 4:51 AM IST

చంద్రబాబు తన స్వార్థం కోసమే రాజధాని పేరుతో అమరావతిలో రాద్ధాంతం చేస్తున్నారని, ప్రజలను రెచ్చగొట్టి వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

అమ్మఒడి సభలో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు ఇలాగే చేస్తుంటే రాష్ట్రంలో ఎక్కడా చంద్రబాబును తిరగనివ్వమని, ప్రతి దాడులు చేయక తప్పదని అన్నారు. పాలన వికేంద్రీకరణ చేయాలనే లక్ష్యంతో రాయలసీమలో హైకోర్టు, విశాఖలో రాజధాని ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం భావిస్తోందని అన్నారు పెద్దిరెడ్డి.

‘రాజధాని విశాఖకు మారిస్తే చంద్రబాబుకు వచ్చిన నష్టం ఏమిటని ప్రశ్నించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్ ఏడు నెలల వ్యవధిలోనే ఎన్నో అభివృద్ధి పనులు చేశారని కొనియాడారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.