Ramprasad Reddy : రాయచోటి ప్రజలకు క్షమాపణ చెప్పిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి..

Minister Ramprasad Reddy : రాయచోటి ప్రజలకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. 10టీవీతో ఆయన మాట్లాడుతూ..

Ramprasad Reddy : రాయచోటి ప్రజలకు క్షమాపణ చెప్పిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి..

Ramprasad Reddy

Updated On : December 29, 2025 / 8:58 PM IST

Minister Ramprasad Reddy : రాయచోటి ప్రజలకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. 10టీవీతో ఆయన మాట్లాడుతూ.. నా రాజకీయ జీవితంలో ఏనాడూ కన్నీళ్లు రాలేదు. ఈరోజు రాయచోటి ప్రజలకు నష్టం జరుగుతుందని కన్నీళ్లు వచ్చాయి. రాజకీయాల్లో ఎటువంటి గాడ్ ఫాదర్ లేకుండా స్వశక్తితో పైకి వచ్చిన చరిత్ర నాది అని అన్నారు.

Also Read : Ramprasad Reddy: మంత్రి రాంప్రసాద్‌రెడ్డి కన్నీరు.. పిలిపించి మాట్లాడిన చంద్రబాబు..

రాయచోటి ఎమ్మెల్యే తొలిసారి మంత్రిగా చేసింది చంద్రబాబు నాయుడే. నా జీవితంలో ఎక్కువ భావోద్వేగానికి లోనైన సంఘటన జిల్లా కేంద్రం నుంచి రాయచోటి మార్పు. జిల్లా మార్పు అనేది నా ప్రాంతం ప్రజల భవిష్యత్తుకు సంబంధించింది. విధిలేని పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. జిల్లా కేంద్రంగా రాయచోటి ఉండేందుకు నేను చేసిన పోరాటం సీఎం చంద్రబాబుకు తెలుసు అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు.

వైసీపీ నేతలు నా మీద విమర్శలు చేస్తే తగిన రీతిలో సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నానని రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. నష్టపోయిన రాయచోటిని ఏ విధంగా అభివృద్ధి చేయాలో మాకు తెలుసు. రాయచోటి అగ్రగామిగా నిలిపేందుకు సీఎం చంద్రబాబు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆయనకు రాయచోటి మీద మమకారం ఉంది. 18 నెలల కాలంలో రాయచోటి ఎంతగానో అభివృద్ధి చేశామని తెలిపారు. గతంలో అనుకున్న విధంగానే రాయచోటిని ప్రణాళిక బద్దమైన అభివృద్ధితో, అన్ని మౌలిక సదుపాయాలతో కొనసాగుతుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.