MLC Election Results 2023 : ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో సంబరాలు చేసుకున్న టీడీపీ నేతలపై కేసులు పెట్టిన పోలీసులు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించటంతో టీడీపీ నేతలు సంబరాల్లో మునిగితేలుతున్నారు. సంబరాలు చేసుకునే టీడీపీ నేతలపై పోలీసులు కేసులు పెడుతున్నారు. గుడివాడలో టీడీపీ నేతలపై పోలీసులు కేసులు పెట్టారు. మా విధులకు ఆటంకం కలిగించారంటూ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుతో పాలు పలువురు టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

police files case on Gudivada tdp leaders after mlc election victory celebration
MLC Election Results 2023 : ఆంధ్రప్రదేశ్ లో మూడు గ్రాడ్యుయేట్ స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు టీడీపీ ఖాతాలో పడ్డాయి. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు భారీ మెజారిటీతో విజయం సాధించారు. అటు తూర్పు రాయలసీమ శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ గెలించారు. పశ్చిమ రాయలసీమలో మాత్రం ఇరు పార్టీల అభ్యర్థుల మధ్య హోరాహోరా పోరు కొనసాగుతోంది.
ఇలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించటంతో టీడీపీ నేతలు సంబరాల్లో మునిగితేలుతున్నారు. సంబరాలు చేసుకునే టీడీపీ నేతలపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. కేసులు పెడుతున్నారు. గుడివాడలో టీడీపీ నేతలపై పోలీసులు కేసులు పెట్టారు. మా విధులకు ఆటంకం కలిగించారంటూ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుతో పాలు పలువురు టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. టీడీపీ నేతలు తమకు అసభ్యపదజాలంతోదూషించారు అంటూ ఎస్సై గౌతమ్ ఫిర్యాదు మేరకు 353,341,290,503, R/W4 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో తెలుగు తమ్ముళ్లు గుడివాడలో సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి నినాదాలు చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.. విజయోత్సవాలకు అనుమతి లేదని చెప్పారు.. ఈ క్రమంలో టీడీపీ నేతలతో వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసులు మాజీ ఎమ్మెల్లయే రావితో పాటూ టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు.
ఏపీలో జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ రెండుచోట్ల విజయం సాధించింది. ఈ విజయాన్ని తెలుగు తమ్ముళ్లు రాష్ట్రవ్యాప్తంగా రంగులు పూసుకుంటూ డ్యాన్సులు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకుని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతల సంబరాలు చేసుకోవటం చూసి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవటంతో భరించలేక వైసీపీ నేతలు పోలీసులను తమపై ఉసిగొల్పి అక్రమంగా కేసులు పెడుతున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
గుడివాడలో టీడీపీ నేతలు సంబరాలు చేసుకోవటం వల్ల తమ విధులకు ఆటంకం కలిగింది అంటూ టీడీపీ నేతలపై గుడివాడ వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో శుక్రవారం (మార్చి17,2023) కేసు నమోదైంది. గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుతో సహా పలువురు టీడీపీ నేతలు మా విధులకు ఆటంకం కలిగించారని..శాంతి భద్రతలకు విఘాతం కలిగించాని..ప్రజలు తిరిగే ప్రాంతంలో బాణసంచా కాల్చారని..అసభ్య పదజాలంతో మాట్లాడారని ఎస్సై ఫిర్యాదుతో కేసులు నమోదు చేశారు.
MLC Election Results 2023 : పవన్ కళ్యాణ్ మాట నిజమైంది.. ఈ ఎన్నికలు శుభపరిణామం.. గంటా శ్రీనివాసరావు