MLC Ramachandraiah : వైసీపీలో చేరాలని మా ఇంటి చుట్టూ తిరిగినప్పుడు ఆ విషయం గుర్తుకు రాలేదా?
వైసీపీ హయాంలో ప్రజల ఆస్తులను కాపాడుకోలేక పోయాం. పాలనలో జరుగుతున్న తప్పిదాలను సీఎం జగన్ కు చెప్పడానికి అవకాశం రాలేదు. జగన్ తో మనస్సు విప్పి మాట్లాడే అవకాశం రాలేదని సి. రామచంద్రయ్య అన్నారు.

MLC Ramachandraiah
YCP MLC : వైసీపీ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా, ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. రాష్ట్రంలో ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయని జగన్ పాలనపై విమర్శలు చేశారు. అరాచక పాలనలో భాగస్వామ్యం కాకూడదనే వైసీపీకి రాజీనామా చేశానని చెప్పారు. ఎమ్మెల్సీగా ఇంకా మూడేళ్లు పదవీకాలం ఉన్నా రాజీనామా చేస్తానని రామచంద్రయ్య అన్నారు. ప్రజా జీవితంలో రాజీపడకుండా బతికా.. ఇప్పటి వరకు రాజకీయ విలువలు కాపాడుకుంటూ వచ్చా. వైసీపీలో ఉన్నందుకు చాలాకాలం నుంచి అంతర్మథనం చెందానని రామచంద్రయ్య చెప్పారు.
Also Read : TDP Leader B Tech Ravi : బ్రదర్ అనిల్‌ను కలవడంపై స్పందించిన బీటెక్ రవి.. సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
వైసీపీ హయాంలో ప్రజల ఆస్తులను కాపాడుకోలేక పోయాం. పాలనలో జరుగుతున్న తప్పిదాలను సీఎం జగన్ కు చెప్పడానికి అవకాశం రాలేదు. జగన్ తో మనస్సు విప్పి మాట్లాడే అవకాశం రాలేదని సి. రామచంద్రయ్య అన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో జగన్ చూసుకోవాలని సూచించారు. పార్టీలో నుంచి బయటకు వచ్చామని స్ర్కాప్ అంటున్నారు.. పార్టీలో చేరమని మా ఇంటి చుట్టూ తిరిగినప్పుడు స్క్రాప్ అని తెలియదామీకు అంటూ వైసీపీ అధిష్టానంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Telangana Congress Party : పార్లమెంట్ ఎన్నికలపై సీఎం రేవంత్ ఫోకస్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరాంకు చాన్స్
వైసీపీలో రాజకీయంగా ప్రజాస్వామ్యం కనిపించలేదు. సలహాదారులైనా సరైన సలహాలు ఇచ్చి జగన్ ను మారిస్తే బాగుంటుందని రామచంద్రయ్య అన్నారు. క్యాడర్ సలహాలు తీసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వందల కోట్లు ప్రజాధనం కోర్టులో కేసులకు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. 12లక్షల కోట్లు అప్పులు చేశారు. రాష్ట్రంలో ఆదాయం వచ్చే సెక్టార్ దెబ్బతింది. కేసులకోసం కేంద్రంతో రాజీపడి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు వదులుకున్నారు. సాధికారత సభల వల్ల ఎలాంటి ఉపయోగం అంటూ సి. రామచంద్రయ్య వైసీపీ అధిష్టానాన్ని ప్రశ్నించారు.