CPI Ramakrishna : ప్రభుత్వ ఆస్తులను దోచేస్తున్న మోదీ, అదానీ, జగన్ : రామకృష్ణ

జగన్ చేతకాని తనాన్ని కప్పి‌ పుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. జగన్ రాజకీయంగా ఆత్మహత్య చేసుకోవడం ఖాయమన్నారు.

CPI Ramakrishna : ప్రభుత్వ ఆస్తులను దోచేస్తున్న మోదీ, అదానీ, జగన్ : రామకృష్ణ

CPI Ramakrishna

Updated On : April 12, 2023 / 1:21 PM IST

CPI Ramakrishna : మోదీ, అదానీ, జగన్ ఒక టీంగా ఏర్పడి ప్రభుత్వ ఆస్తులను దోచేస్తున్నారని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. వీటిని తాము బయటపెడితే… టీడీపీకి మద్దతు ఇస్తారని తమపై పడి ఏడుస్తున్నారని పేర్కొన్నారు. జగన్ కు ‌చేతనైతే కేటిఆర్ వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలన్నారు. వాళ్లు ఇచ్చే డబ్బులకు కక్కుర్తి పడి, లాలూచీ పడి జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు. అచ్చెన్న హత్యపై జగన్ ఎందుకు స్పందించ లేదని ప్రశ్నించారు.

సీఎం, హోంమంత్రి కూడా కనీసం పరామర్శించలేదన్నారు. దళితుడు కాబట్టే ప్రభుత్వ పెద్దలకు చిన్న చూపు అన్నారు. అగ్ర కులాలకు ఒక న్యాయం, దళితులకు మరొక న్యాయమే జగన్ పాలన అని ఎద్దేవా చేశారు. ఇది నిజంగా సైకో ప్రభుత్వం అని జగన్ నిరూపించారని పేర్కొన్నారు. బెయిల్ రద్దు అయితే జగన్ ఏ జైలుకు పోతాడో తెలియదన్నారు.

Andhra Pradesh High court : జీవో నంబర్ 1పై హైకోర్టులో సీపీఐ రామకృష్ణ పిటీషన్ .. విచారణ చేపట్టిన ధర్మాసనం

తెలుగు రాష్ట్రాల్లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై చర్చ జరుగుతుందని అన్నారు. అన్నీ తెలిసిన సజ్జల అసత్యాలు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని‌ ప్రైవేటుపరం‌ చేస్తామని కేంద్రం ప్రకటించిందని తెలిపారు. దానిని అదానీకి కట్ట బెట్టడానికి కుట్రలు చేసిందని చెప్పారు. ప్రైవేటుపరం‌ చేయడం ద్వారా ఆ స్థలాలు అమ్ముకోవాలని‌ చూస్తున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నోరు మెదపరని విమర్శించారు.

జగన్ మంచి సలహా ఇచ్చాడంటున్న సజ్జల వాటిని బహిరంగం‌ చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం విషయంలో కూడా అన్నీ డ్రామాలేనని విమర్శించారు. జగన్ చేతకాని తనాన్ని కప్పి‌ పుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. జగన్ రాజకీయంగా ఆత్మహత్య చేసుకోవడం ఖాయమన్నారు. అదానీతో జగన్ కుమ్మక్కు అయ్యారని.. ‌వేల‌ కోట్లు విలువ చేసే భూములు ఇచ్చారని ఆరోపించారు.

CPI Ramakrishna: ఇప్పటికే జగన్ బీజేపీ రోడ్డు మ్యాప్ లో నడుస్తున్నారు: సీపీఐ కార్యదర్శి రామకృష్ణ

ప్రజల భవిష్యత్తు జగన్ అంటూ… బలవంతంగా స్టిక్కర్లను అంటిస్తున్నారని తెలిపారు. ‘ప్రజల సొంత ఆస్తులపై మీ బొమ్మలుతో పెత్తనం ఏమిటి’ అని రామకృష్ణ నిలదీశారు. తరతరాలుగా వస్తున్న ఆస్తులకు జగన్ ఫొటోతో హక్కు పత్రాలు ఏమిటని ప్రశ్నించారు. జగన్ కు పిచ్చి పరాకాష్టకు‌ చేరిందని.. ప్రజలు‌ బుద్ధి చెప్పడం ఖాయమని స్పష్టం చేశారు.