బహుముఖ ప్రజ్ఞాశాలి : గొల్లపూడి మారుతీరావు

  • Published By: veegamteam ,Published On : December 12, 2019 / 07:58 AM IST
బహుముఖ ప్రజ్ఞాశాలి : గొల్లపూడి మారుతీరావు

Updated On : December 12, 2019 / 7:58 AM IST

ప్రముఖ నటుడు..రచయిత, యాంకర్,సంపాదకుడు, వ్యాఖ్యత గొల్లపూడి మారుతీరావు కన్నూమూశారు. అనారోగ్య కారణాలతో చెన్నై హాస్పిటల్ లో గత కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్న గొల్లపూడి మారుతీరావు తుదిశ్వాస విడిచారు.

తెలుగు సాహిత్యాభివృద్ధికి గొల్లపూడి మారుతీరావు ఎనలేని కృషి చేశారు. తెలుగు సినిమా రంగంలో మాటల రచయితగాను నటుడిగానూ సుపరిచితుడు. సినిమాల్లోకి రాకముందు నాటకాలు, కథలు, నవలలు రాశాడు. రేడియో ప్రయోక్తగానూ, అసిస్టెంట్ స్టేషను డైరెక్టరుగానూ, ఆంధ్రప్రభ (దినపత్రిక) ఉపసంపాదకుడిగానూ పనిచేశాడు.

సినిమా రంగంలో ఆయన మొట్టమొదటి రచన డాక్టర్ చక్రవర్తికి ఉత్తమ రచయితగా నంది అవార్డుతో పాటు మరో మూడు నందులు అందుకున్నాడు. తెలుగు సాహిత్యంపై ఆయన వ్రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉన్నాయి. గొల్లపూడి మారుతీ రావు 1939 ఏప్రిల్ 14 న విజయనగరంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు అన్నపూర్ణ, సుబ్బారావు లకు ఐదవ కుమారుడు.