28న జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలి : నాదెండ్ల మనోహర్
ఈనెల 28న ప్రత్తిపాడులో 21 ఎకరాల్లో ఉమ్మడి బహిరంగ సభ ఉంటుందని, రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ, జనసైనికులతో పాటు ప్రజలందరిని ఈ సభకు ఆహ్వానిస్తున్నామని నాదెండ్ల మనోహర్ చెప్పారు.

Nadendla Manohar
Nadendla Manohar : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం, జనసేన పార్టీల ఉమ్మడి బహిరంగ సభను ఈనెల 28న నిర్వహించనున్నారు. భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లును, ప్రాంగణాన్ని జనసేన నేత నాదెండ్ల మనోహర్ శుక్రవారం పరిశీలించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నేతలతో చర్చించి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈనెల 28న ప్రత్తిపాడులో 21 ఎకరాల్లో ఉమ్మడి బహిరంగ సభ ఉంటుందని, రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ, జనసైనికులతో పాటు ప్రజలందరిని ఈ సభకు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఈ వేదికపై 175 నియోజకవర్గాల నుండి 500 మంది టీడీపీ – జనసేన నేతలు పాల్గొంటారని తెలిపారు. ఆరు లక్షల మంది ఈ సభలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామని, రాజకీయ ప్రస్థానంలో ఈ సభ అద్భుతంగా ఉంటుందని అన్నారు. టీడీపీ నేతలు కూడా ఈ మూడు రోజులూ బహిరంగ సభ విజయవంతానికి పిలుపునివ్వాలని నాదెండ్ల సూచించారు.
https://twitter.com/JanaSenaParty/status/1760938646788825411